AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Results 2025: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడో చెప్పేసిన బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య

అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ముందే తక్కువ మార్కుల తేడాతే ఫెయిల్ న పేపర్లను మరోసారి వాల్యూయేషన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులకు నష్టం జరగకుండా ఉంటుందని అంటున్నారు. ఇంటర్ రిజల్ట్స్ ఇచ్చాక విద్యార్థులు కావాలంటే రీ వాల్యూయేషన్ కు అప్లై చేసుకునే ఛాన్స్ ఎప్పటిలానే ఉంటుందని అన్నారు.

TS Inter Results 2025: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడో చెప్పేసిన బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య
Inter Results 2025
Vidyasagar Gunti
| Edited By: Jyothi Gadda|

Updated on: Apr 15, 2025 | 4:28 PM

Share

ఏపీలో ఇంటర్ ఫలితాలు వెలువడటంతో తెలంగాణలో ఫలితాలు ఎప్పుడు వస్తాయో అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత నెల 25న తెలంగాణ ఇంటర పరీక్షలు పూర్తయ్యాయి. నెల రోజుల లోపే ఫలితాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 25 లోపే ఫలితాలను వెల్లడించేందుకు సన్నాహాకాలు చేస్తోంది ఇంటర్ బోర్డు.

ఇంటర్ ఫలితాల ప్రకటనపై ఇంటర్ బోర్డు సెక్రటరీ ఐఏఎస్ కృష్ణ ఆదిత్య టీవీ9తో మాట్లాడుతూ.. ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే స్పాట్ వాల్యూయేషన్ తో పాటు ర్యాండమ్ రీ వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తైంది. చివరి ప్రాసెస్ లో భాగంగా వెరిఫికేషన్ కోసం సీజీజీకి పంపించినట్లు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు, ఈ నెల 20 నాటికి ఫలితాలు వెల్లడించేందుకు అంతా రెడీగా ఉంటుందని. 20 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఆధారంగా ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు.

విద్యార్థులకు నష్టం జరగకుండా ముందే రీ వాల్యుయేషన్:

ఇవి కూడా చదవండి

సాధారణంగా ఇంటర్ ఫలితాలు స్పాట్ వాల్యూయేషన్ తర్వాత సీజీజీ వెరిఫికేషన్ అవగానే ఇస్తారు. కానీ తొలిసారిగా స్పాట్ వాల్యుయేషన్ తర్వాత ర్యాండమ్ రీ వాల్యూయేషన్ చేసి మరి ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఫలితాల వెల్లడి తర్వాత ఏటా 60 వేల మంది విద్యార్థులు ఒకటి, రెండు మార్కులు తక్కువ వచ్చాయని రీ వాల్యూయేషన్ కు అప్లై చేస్తున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ముందే తక్కువ మార్కుల తేడాతే ఫెయిల్ న పేపర్లను మరోసారి వాల్యూయేషన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులకు నష్టం జరగకుండా ఉంటుందని అంటున్నారు. ఇంటర్ రిజల్ట్స్ ఇచ్చాక విద్యార్థులు కావాలంటే రీ వాల్యూయేషన్ కు అప్లై చేసుకునే ఛాన్స్ ఎప్పటిలానే ఉంటుందని అన్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.