AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top Institutes for AI, Data Science 2025: ఏఐ, డేటా సైన్స్ కోర్సులు అందించే టాప్‌ 7 యూనివర్సిటీలు.. ఫుల్‌ లిస్ట్ ఇదే

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్ టెక్నాలజీలు అగ్ర స్థానంలో ఉన్నాయి. యంత్రాలను మనిషి మాదిరి పని చేయడానికి, సంక్లిష్టమైన పనులను పరిష్కరించడానికి, డేటా సైన్స్ శాస్త్రీయ పద్ధతులు, ప్రక్రియలు, అల్గారిథమ్‌లను ఉపయోగించి..

Top Institutes for AI, Data Science 2025: ఏఐ, డేటా సైన్స్ కోర్సులు అందించే టాప్‌ 7 యూనివర్సిటీలు.. ఫుల్‌ లిస్ట్ ఇదే
Top Institutes for AI, Data Science courses
Srilakshmi C
| Edited By: TV9 Telugu|

Updated on: Aug 18, 2025 | 1:47 PM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్ టెక్నాలజీలు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇవి అసాధారణమైన కెరీర్ అవకాశాలను సైతం అందిస్తున్నాయి. యంత్రాలను మనిషి మాదిరి పని చేయడానికి, సంక్లిష్టమైన పనులను పరిష్కరించడానికి, డేటా సైన్స్ శాస్త్రీయ పద్ధతులు, ప్రక్రియలు, అల్గారిథమ్‌లను ఉపయోగించి పెద్ద మొత్తంలో డేటా నుంచి సమాచారం సంగ్రహించడానికి ఏఐ వీలు కల్పిస్తుంది. ఈ విభాగాలు సాంకేతికత, ఆవిష్కరణల భవిష్యత్తును కొత్త రూపు దాల్చేలా చేస్తున్నాయి. నిరంతరం విస్తరిస్తున్న IT, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలకు అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను ఎప్పటికప్పుడు ఉత్పత్తి చేయడంలో ఈ రంగాలు కీలకంగా మారాయి. అందువల్లనే ప్రస్తుతం విద్యార్ధులు AI, డేటా సైన్స్ కోర్సులను నేర్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.

భారత్‌లో AI, డేటా సైన్స్ కోర్సులుల అందించే విద్యాసంస్థలు ఇవే..

2025లో క్వాక్వారెల్లి సైమండ్స్ (QS) ర్యాంక్ ఇచ్చిన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను చదివేందుకు ప్రవేశాలు కల్పిస్తున్న భారత్‌లోని టాప్‌ యూనివర్సిటీలు ఇవే..

  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూరు
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IITB)
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (IITD)
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (IITK)
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ (IIT-KGP)
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IITM)
  • వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT), వెల్లూరు

QS ర్యాంకింగ్స్ ప్రకారం.. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్‌ల జాబితాలో 100కి పైగా యూనివర్సిటీలు అవకాశం కల్పిస్తున్నాయి. సాంకేతిక రంగంలో ఆవిష్కరణలకు అత్యంత ఉత్తేజకరమైన రంగాలలో ఒకటిగా డిమాండ్‌ కలిగి ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులు ఆకర్షణీయమైన కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. డేటా సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల విషయంలో సింగపూర్ నేషనల్ యూనివర్సిటీని.. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ అధిగమించి ఆసియాలోనే టాప్‌ యూనివర్సిటీగా అవతరించింది.

ఇవి కూడా చదవండి

AI, డేటా సైన్స్ కోర్సులను అందించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్‌ యూనివర్సిటీలు ఇవే..

  • మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)
  • కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం
  • ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
  • కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ (UCB)
  • నాన్యాంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం (NTU), సింగపూర్

ఈ రంగాలలో ఎలాంటి కెరీర్ అవకాశాలు లభిస్తాయంటే..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ద్వారా.. AI ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, AI రీసెర్చ్ సైంటిస్ట్, AI కన్సల్టెంట్ వంటి వివిధ కెరీర్‌ రోల్స్‌ను అందిపుచ్చుకోవచ్చు. మరోవైపు, డేటా సైన్స్ చదవడం వల్ల డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా ఇంజనీర్ వంటి అవకాశాలు లభిస్తాయి. ఈ రంగాలలో విస్తృత శ్రేణిలో కెరీర్ అవకాశాలను అందిస్తాయి. ఇక AI, డేటా సైన్స్‌.. ఈ రెండు రంగాలు భవిష్యత్తుకు అనువైనవి సర్వత్రా భావిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్, ప్రొడక్టివిటీ వంటి పరిశ్రమలలో మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రభావవంతమైన కెరీర్‌లను లక్ష్యంగా చేసుకునే విద్యార్థులకు ఇవి గొప్ప ఎంపిక. మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి