TS Inter Exams: నేడు తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా.?
TS Inter Exams: కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసినట్లుగానే తెలంగాణలోనూ ఇంటర్, టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరికాసేపట్లో..
TS Inter Exams: కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసినట్లుగానే తెలంగాణలోనూ ఇంటర్, టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరికాసేపట్లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. సోమవారం (ఈరోజు) సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు. మధ్యాహ్నం తర్వాత ఫలితాలను విడుదల చేయనున్నారు. సెకండ్ విద్యార్థులు తమ పరీక్షా ఫలితాలను ఇంటర్‌బోర్డ్ అధికారికి వెబ్‌సైట్ అయిన www.tsbie.cgg.gov.inలో చూడొచ్చని అధికారులు తెలిపారు. నిజానికి పరీక్షలను నిర్వహించాలని ప్రయత్నించినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. పరీక్షలను రద్దు చేసిన క్రమంలో సెకండ్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్‌లో ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులనే సెకండ్ ఇయర్‌కి కూడా కేటాయిస్తామని ఇప్పటికే తెలిపారు. ఇక ప్రాక్టికల్స్‌లో అందరికీ 100 శాతం మార్కులు ఇస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రం.. ఆయా సబ్జెక్టులకు 35 శాతం మార్క్స్ కేటాయించనున్నారు. ఇక ఈ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులకు కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగిన తర్వాత పరీక్షలు కూడా రాసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
Also Read: Gold and Silver Price Today: పెరిగిన బంగారం ధరలు.. నిలకడగా ఉన్న వెండి.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు