Petrol And Diesel Price: సామాన్యుడికి పెను భారంగా మారుతోన్న ఇంధ‌న ధ‌ర‌లు.. హైద‌రాబాద్‌లో రూ. 102కి చేరిన పెట్రోల్‌

Petrol And Diesel Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. పెర‌గ‌డ‌మే త‌ప్ప త‌గ్గ‌డం అంటూ తెలియ‌కుండా పోతోన్న ఇంధ‌న ధ‌ర‌ల కార‌ణంగా సామాన్యుడికి పెను భారంగా మారుతోంది. చరిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా...

Petrol And Diesel Price: సామాన్యుడికి పెను భారంగా మారుతోన్న ఇంధ‌న ధ‌ర‌లు.. హైద‌రాబాద్‌లో రూ. 102కి చేరిన పెట్రోల్‌
Petrol And Diesel Price
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 28, 2021 | 6:32 AM

Petrol And Diesel Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. పెర‌గ‌డ‌మే త‌ప్ప త‌గ్గ‌డం అంటూ తెలియ‌కుండా పోతోన్న ఇంధ‌న ధ‌ర‌ల కార‌ణంగా సామాన్యుడికి పెను భారంగా మారుతోంది. చరిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా అత్యంత త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ‌సార్లు ఇంధ‌న ధ‌ర‌ల్లో పెరుగుద‌ల క‌నిపిస్తోంది. దేశంలోని చాలా న‌గ‌రాల్లో ఇప్ప‌టికే లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100 దాటేసింది. సోమ‌వారం దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ రూ. 98.46 గా ఉండగా, డీజిల్ రూ. 88.90 వ‌ద్ద ఉంది. * దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో పెట్రోల్ ధ‌ర రూ. 104.56 వ‌ద్ద ఉండ‌గా డీజిల్ రూ. 96.42 వ‌ద్ద కొన‌సాగుతోంది. * త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో సోమ‌వారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 99.49 గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ. 93.46 గా న‌మోదైంది. * క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో లీట్ పెట్రోల్ ధ‌ర రూ. 10.175 కు చేరుకోగా, డీజిల్ రూ. 94.25 గా కొన‌సాగుతోంది.

తెలుగులు రాష్ట్రాల విష‌యానికొస్తే..

* తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో సోమవారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 102.32 గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ. 96.90 గా న‌మోదైంది. * తెలంగాణ‌లో మ‌రో ముఖ్య పట్ట‌ణ‌మైన క‌రీంన‌గ‌ర్‌లో లీట‌ర్ పెట్రోల్ రూ. 102.20 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, డీజిల్ ధ‌ర రూ. 96.77 గా ఉంది. * ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికొస్తే విజ‌య‌వాడ‌ల‌లో సోమ‌వారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 105.09 గా ఉండ‌గా, డీజిల్ రూ. 99.02 వ‌ద్ద కొన‌సాగుతోంది. * ఇక సాగ‌ర తీరం విశాఖ‌ప‌ట్నంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 103.41 గా ఉండ‌గా, డీజిల్ రూ. 97.41 గా న‌మోదైంది.

Also Read: Delta Variant: డెల్టా ప్లస్‌ వేరియంట్‌: కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ ఒక్కటే సరిపోదు: డబ్ల్యూహెచ్‌వో

DOOSRA: సిమ్‌ కార్డు లేకుండానే ఫోన్‌ కాల్స్‌.. రాంగ్ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు కొత్త యాప్‌ను సృష్టించిన హైదరాబాది

Viral Video: కోడిపిల్లకు ముద్దుల మీద ముద్దులు పెడుతున్న కోతిపిల్ల.. నవ్వులు పూయిస్తున్న వీడియో..