Delta Variant: డెల్టా ప్లస్ వేరియంట్: కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదు: డబ్ల్యూహెచ్‌వో
Delta Variant: కరోనా మహమ్మారి కారంగా ఇప్పటికే ప్రపంచమంతా అతలాకుతలమవుతోంది. ఇక కరోనాలో ఇటీవల కొత్తగా వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా వ్యాప్తి..
Delta Variant: కరోనా మహమ్మారి కారంగా ఇప్పటికే ప్రపంచమంతా అతలాకుతలమవుతోంది. ఇక కరోనాలో ఇటీవల కొత్తగా వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా వ్యాప్తి చెందుతున్న కొత్త రకం వేరియంట్ డెల్టా ప్లస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పందించింది. డెల్టా ప్లస్ వేరియంట్‌ను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదని, వ్యాక్సిన్‌తో పాటు మాస్కులు ధరించడం ముఖ్యమని తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే ఈ వేరియంట్‌ను ఆందోళనకరంగా పేర్కొంది.
డెల్టా రకాన్ని ఎదుర్కొవడంలో వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ రష్యా ప్రతినిధి మోలీటా వునోవిక్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ +మాస్కులను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ వల్ల వైరస్ వ్యాప్తిని కొంత వరకు తగ్గించడంతో పాటు తీవ్ర ఇన్‌ఫెక్షన్ ప్రభావం నుంచి బయటపడవచ్చని అన్నారు. అయినా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు. తొందరగా చర్యలు చేపట్టకపోతే మరోసారి లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు వస్తాయని అన్నారు.
11 దేశాలకు విస్తరించిన డెల్టా ప్లస్
డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళనకరమైనదిగా ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఈ రకం వేరియంట్ 11 దేశాలకు వ్యాపించగా, దాదాపు 200లకుపైగా కేసులు నమోదయ్యాయి. అమెరికా, భారత్‌తో పాటు బ్రిటన్, పోర్చుగల్‌లో ఈ కేసులు సంఖ్య అధికంగా ఉంది. చాలా దేశాల్లో కరోనా వైరస్ మరోసారి విజృంభణకు ఈ వేరియం దోహదం కానుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. అందేకే వ్యాక్సిన్‌తో పాటు మాస్కలు తప్పనిసరిగా ధరించాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది.