Telangana JL Posts: 2,280 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌.. త్వరలోనే నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కాంట్రాక్టు, పార్ట్‌ టైం, అతిథి అధ్యాపకుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి త్వరలో నియామక నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. కాగా ఇప్పటికే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే..

Telangana JL Posts: 2,280 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌.. త్వరలోనే నోటిఫికేషన్‌
Junior Lecturer Jobs In Telangana
Follow us

|

Updated on: Aug 29, 2024 | 3:32 PM

హైదరాబాద్‌, ఆగస్టు 29: తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కాంట్రాక్టు, పార్ట్‌ టైం, అతిథి అధ్యాపకుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి త్వరలో నియామక నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. కాగా ఇప్పటికే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మల్టీజోన్‌ 1లో 724 పోస్టులు, మల్టీజోన్‌ 2లో 668 పోస్టులను భర్తీ చేశారు. మొత్తం 16 సబ్జెక్టులకు గానూ 11 రోజుల పాటు ఈ పరీక్షలు జరిపి, నియామక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ పోస్టులతోపాటు తెలంగాణ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మొత్తం 793 డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేసింది. గానూ ఈ పరీక్ష నిర్వహించింది. ఇక సంక్షేమ గురుకులాల్లో 1924 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేసింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్ధులు.. వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. సెస్టెంబర్ 2 నాటికి డీఎస్సీ తుది ఆన్సర్‌ కీ వెలువడించి, ఆ తర్వాత వెనువెంటనే ఫలితాలు కూడా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక వర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సర ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రథమ సంవత్సర ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డా వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు.

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

తెలంగాణలోని కాకతీయ విశ్వవిద్యాలయం జులైలో నిర్వహించిన డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను రిజిస్ట్రార్‌ మల్లారెడ్డి విడుదల చేశారు. రెండో సెమిస్టర్‌లో 28 శాతం, నాలుగో సెమిస్టర్‌లో 36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్లో చూడొచ్చని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ నరసింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారిణి తిరుమలదేవి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

2,280 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ గ్రీన్ సిగ్నల్
2,280 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ గ్రీన్ సిగ్నల్
రేస్ లో నుండి తప్పుకున్న కంగువ !! సోలోగా రానున్న సూపర్ స్టార్
రేస్ లో నుండి తప్పుకున్న కంగువ !! సోలోగా రానున్న సూపర్ స్టార్
మరోసారి 'డీప్ ఫేక్’ బారిన కింగ్ కోహ్లీ.. ఏకంగా అలా చూపించారేంటి?
మరోసారి 'డీప్ ఫేక్’ బారిన కింగ్ కోహ్లీ.. ఏకంగా అలా చూపించారేంటి?
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
ప్రగ్యా నయ పిక్స్ చూస్తే ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే
ప్రగ్యా నయ పిక్స్ చూస్తే ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే
నాకు ఫ్లాప్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూశారు..
నాకు ఫ్లాప్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూశారు..
ఒక్క 5 నిమిషాలు ఈ ఆసనం వేస్తే.. గుట్టలాంటి పొట్టైనా కరగాల్సిందే..
ఒక్క 5 నిమిషాలు ఈ ఆసనం వేస్తే.. గుట్టలాంటి పొట్టైనా కరగాల్సిందే..
జియో యూజర్లకు అంబానీ అద్దిరిపోయే న్యూస్..
జియో యూజర్లకు అంబానీ అద్దిరిపోయే న్యూస్..
హైడ్రా.. వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
హైడ్రా.. వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
మాంసం కోసం 900 ఏనుగులు, జీబ్రాలు చంపేందుకు సర్కార్ ఉత్తర్వులు
మాంసం కోసం 900 ఏనుగులు, జీబ్రాలు చంపేందుకు సర్కార్ ఉత్తర్వులు