TG DSC 2024 Result Date: ‘వారంలో డీఎస్సీ ఫలితాలు.. త్వరలోనే 6 వేల ఉపాధ్యాయ పోస్టులతో మరో డీఎస్సీ’ డీప్యూటీ సీఎం భట్టీ

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గతంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఉపాధ్యాయులకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా.. తమ ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని..

TG DSC 2024 Result Date: 'వారంలో డీఎస్సీ ఫలితాలు.. త్వరలోనే 6 వేల ఉపాధ్యాయ పోస్టులతో మరో డీఎస్సీ' డీప్యూటీ సీఎం భట్టీ
CM Bhatti Vikramarka
Follow us

|

Updated on: Sep 06, 2024 | 3:17 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గతంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఉపాధ్యాయులకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా.. తమ ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని మంత్రి భట్టీ తాజాగా మరోమారు చెప్పారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సెప్టెంబరు 5న రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భట్టీ, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సుమారు 150 మంది ఉత్తమ టీచర్లను సత్కరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ..

విద్యారంగానికి, ఉపాధ్యాయులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గత పదేళ్లలో ఉపాధ్యాయులు పదోన్నతులు లేక, బదిలీలు జరక్క ఇబ్బంది పడ్డారని, సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం 45 వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో పాటు మరో 30 వేల మందికి పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ పరీక్ష ఫలితాలు వారం రోజుల్లో వస్తాయన్నారు. అనంతరం త్వరలోనే మరో 6 వేల పోస్టులకు ఉద్యోగ ప్రకటన ఇవ్వడానికి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా చోట్ల పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో టీచర్లే శుభ్రం చేసుకున్న సందర్భాలున్నాయన్నారు. ఈ పరిస్థితి తొలగించేందుకు ఈ విద్యా సంవత్సరంలోనే శానిటేషన్‌ సిబ్బంది నియామకానికి తమ ప్రభుత్వం రూ.136 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని, దానిపై సెప్టెంబర్‌ 5వ తేదీన జీవో జారీ చేసినట్లు తెలిపారు.

కాగా ఇప్పటికే డీఎస్సీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధుల కోసం ఏ క్షణమైనా డీఎస్సీ ఫైనల్ కీని అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉంది. డీఎస్సీ ప్రాథమిక ‘కీ’లపై ఏకంగా 28 వేలకుపైగా అభ్యంతరాలు రావడంతో ఫైనల్‌ కీ పట్ల సర్పత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.