TG DSC 2024 Final Key: ఏ క్షణమైన వెలువడనున్న డీఎస్సీ 2024 ఫైనల్ ఆన్సర్‌ ‘కీ’.. ఉత్కంఠగా ఎదురు చూపులు

తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష 2024 రాసిన అభ్యర్ధులు ఫలితాల కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తుది ఆన్సర్‌ కీ విడుదలకానుండగా.. కొన్ని కారణాల రిత్య అది వాయిదా పడింది. దీంతో తుది ఆన్సర్‌ కీ ఎప్పుడు విడుదలవుతుందా.. అని అభ్యర్ధులు ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో తుది ఆన్సర్‌ కీ విడుదలవనుండగా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది..

TG DSC 2024 Final Key: ఏ క్షణమైన వెలువడనున్న డీఎస్సీ 2024 ఫైనల్ ఆన్సర్‌ 'కీ'.. ఉత్కంఠగా ఎదురు చూపులు
TG DSC 2024 Final Key
Follow us

|

Updated on: Sep 06, 2024 | 3:32 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6: తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష 2024 రాసిన అభ్యర్ధులు ఫలితాల కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తుది ఆన్సర్‌ కీ విడుదలకానుండగా.. కొన్ని కారణాల రిత్య అది వాయిదా పడింది. దీంతో తుది ఆన్సర్‌ కీ ఎప్పుడు విడుదలవుతుందా.. అని అభ్యర్ధులు ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో తుది ఆన్సర్‌ కీ విడుదలవనుండగా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీంతో సెప్టెంబర్ 6 లేదా 7 తేదీల్లో ఫైనల్‌ కీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు తుది కీ వెలువడ్డాక డీఎస్సీ రాత పరీక్ష ఫలితాలను కూడా త్వరలోనే విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

ఫలితాల వెల్లడికి సంబంధించిన మొత్తం ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు మరోసారి చెక్‌ చేసేందుకు ఇప్పటికే టీఎస్‌ ఆన్‌లైన్‌కు ఆ వివరాలను పంపారు. అభ్యర్థులు ఎవరికి వారు తుది కీ ప్రకారం తమకు పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవచ్చు. కీ వెల్లడైన తర్వాత రెండు మూడు రోజుల్లో డీఎస్సీ 80 మార్కులకు, టెట్‌ 20 మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్‌ ర్యాంకు లిస్టును విడుదల చేయనున్నారు. తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను ప్రకటిస్తారు. వీరందరికీ డీఈఓలు ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. అనంతరం మెరిట్‌ ఉన్న వారికి నియామక పత్రాలు అందజేస్తారు.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిసారి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. జులై 18 నుంచి ఆగస్టు 13 వరకు డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి. ఆగస్టు 13న విడుదలైన ప్రాథమిక ఆన్సర్‌ కీపై ఏకంగా 28 వేల వరకు అభ్యంతరాలు వచ్చాయి. దీంతో తుది ఆన్సర్‌కీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తుది కీలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు మారుతాయో, ఎన్ని మార్కులు కలుస్తాయో అన్న దానిపై ఉత్కంఠగా అభ్యర్ధులు ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.