TG DSC 2024 Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్‌ ‘కీ’ వచ్చేసింది.. మీకెన్ని మార్కులు వచ్చాయో ఇలా తెలుసుకోండి

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ తుది ఆన్సర్‌ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌. డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షల ఫైనల్‌ కీ శుక్రవారం (సెప్టెంబర్‌ 6) విడుదలైంది. పరీక్షకు అర్హులైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో సబ్జెక్ట్ వైజ్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కూల్‌ అసిస్టెంట్, ల్యాంగ్వేజ్‌ పండిట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌.. పోస్టులకు..

TG DSC 2024 Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్‌ 'కీ' వచ్చేసింది.. మీకెన్ని మార్కులు వచ్చాయో ఇలా తెలుసుకోండి
TG DSC 2024 Final Key
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 06, 2024 | 7:50 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ తుది ఆన్సర్‌ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌. డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షల ఫైనల్‌ కీ శుక్రవారం (సెప్టెంబర్‌ 6) విడుదలైంది. పరీక్షకు అర్హులైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో సబ్జెక్ట్ వైజ్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కూల్‌ అసిస్టెంట్, ల్యాంగ్వేజ్‌ పండిట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌.. పోస్టులకు సంబంధించి వేర్వేరుగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇందులో సెషన్ల వారీగా, సబ్జెక్టుల వారీగా ఆన్సర్‌ కీలను అందుబాటులో ఉంచారు.

తెలంగాణ డీఎస్సీ 2024 ఆన్సర్‌ ‘కీ’ ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

  • తొలుత తెలంగాణ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ ఓపెన్ చెయ్యాలి.
  • అనంతరం హోమ్‌ పేజ్‌లో ‘ఫైనల్ ఆన్సర్‌ కీ’ అనే ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే సబ్జెక్ట్‌ల వారీగా.. సెషన్‌ వైజ్‌ ఆన్సర్‌ కీలు కనిపిస్తాయి.
  • మీకు కావల్సిన సబ్జెక్ట్‌పై క్లిక్‌ చేస్తే ఆన్సర్‌ కీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,45,263 మంది హాజరయ్యారు. ఆగస్టు 13వ తేదీన విడుదలైన ప్రిలిమినరీ ఆన్సర్‌ కీపై అభ్యంతరాలు స్వీకరించగా.. ఏకంగా 28 వేలకుపైగా అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్ష రాసిన అభ్యర్ధుల్లో గందర గోళం నెలకొంది. ఏయే ప్రశ్నలకు ఏయే సమాధానాలు సరైనవో తెలియక తికమకపడిపోయారు. దీంతో తుది ఆన్సర్‌ కీ వచ్చేంత వరకూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ రోజు ఫైనల్ ఆన్సర్‌ కీ విడుదలవడంతో ఉత్కంఠకు తెరపడింది.

ప్రాథమిక ఆన్సర్‌ కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ.. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, తుది ఆన్సర్‌ కీని విడుదల చేసింది. అభ్యర్థులు ఎవరికి వారు ఆన్సర్‌ కీలను చెక్‌ చేసుకుని, తమకు పరీక్షల్లో వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. వాటికి టెట్‌ వెయిటేజీ మార్కులను కలుపుకుంటే మొత్తం 100 మార్కులకు మీకు ఎన్ని మార్కులు వచ్చాయో లెక్కించవచ్చు. ఇక రెండు, మూడు రోజుల్లో డీఎస్సీ ఫలితాలు కూడా ప్రకటించనున్నారు. అభ్యర్ధుల డీఎస్సీ మార్కులకు, టెట్‌ మార్కులను కలిపి.. ఫైనల్ ర్యాంకును ప్రభుత్వం ప్రకటిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!