Reliance: ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రియలయన్స్ కీలక నిర్ణయం.. ‘స్కిల్లింగ్ అకాడమీ’ ఏర్పాటు
యువతలో నైపుణ్యాలను పెంచేందుకు.. 'రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ'ని ప్రారంభించింది. కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, విద్యా శాఖల సహాయ మంత్రి జయంత్ చౌధరి ఈ అకాడమీని లాంఛనంగా ప్రారంభించారు. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC)తో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన 'భవిష్యత్ ఉద్యోగాల కోసం యువతకు సాధికారత'...
సరైన నైపుణ్యాలు లేని కారణంగా యువతకు ఉద్యోగం లభించడం లేదనే విషయం తెలిసిందే. ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఉద్యోగానికి కావాల్సిన సరైన నైపుణ్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలాంటి వారికోసమే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రియలన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో జాబ్ మార్కెట్ కు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
యువతలో నైపుణ్యాలను పెంచేందుకు.. ‘రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ’ని ప్రారంభించింది. కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, విద్యా శాఖల సహాయ మంత్రి జయంత్ చౌధరి ఈ అకాడమీని లాంఛనంగా ప్రారంభించారు. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC)తో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన ‘భవిష్యత్ ఉద్యోగాల కోసం యువతకు సాధికారత’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇందులో ప్రభుత్వ, రాజకీయ, కార్పొరేట్ పరిరక్షణ, పరిశ్రమ, పౌర సమాజంతో పాటు విద్యా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. స్కిల్ బిల్డింగ్, ఎక్స్పర్ట్ గైడెన్స్ అందించే ఫ్యూచర్ రెడీ కోర్సులను స్కిల్లింగ్ అకాడమీ ద్వారా అందించనున్నారు. పరిశ్రమల అనుసంధానంతో కెరీర్ డెవలప్‌మెంట్‌కు తోడ్పాటును అందించనుంది. ఈ సందర్భంగా మంత్రి జయంత్ చౌధరి మాట్లాడుతూ.. యువతలో జీవితకాల అధ్యయనం అనే సంస్కృతిని ప్రోత్సహించడం తమ లక్ష్యమని తెలిపారు.
యువతను శక్తివంతం చేయాలనే ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా తాను ఈరోజు ‘రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ’ని ప్రారంభించడం సంతోషకరమని అన్నారు ఇది యువతకు 21వ శతాబ్దం నైపుణ్యాలను అందించడంలో ఒక అడుగు ముందుకేసిన కార్యక్రమం అని మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక రిలయన్స్ ఫౌండేషన్ CEO, శ్రీ జగన్నాథ కుమార్ మాట్లాడుతూ.. యువత ఆశయాలను నెరవేర్చడంలో సహకరించడం రిలయన్స్ ఫౌండేషన్ ప్రాథమిక లక్ష్యాల్లో భాగమన్నారు. ఈ స్కిల్లింగ్ అకాడమీ యువతను భవిష్యత్ ఉద్యోగాల కోసం సిద్ధం చేయడంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. ” అని పేర్కొన్నారు. రియలన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..