AP 10th Class Public Exams: ఆ విద్యార్ధులకు పదోతరగతి పాత సిలబస్‌ ప్రకారంగానే పబ్లిక్‌ పరీక్షలు.. విద్యాశాఖ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదో తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే పబ్లిక్‌ పరీక్షల్లో పరీక్షలు పాత సిలబస్‌ ప్రకారంగానే జరుగుతాయని స్పష్టం చేసింది. 2022, 2023, 2024 బ్యాచ్‌లకు చెందిన పదోతరగతి ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని, వీరందరికీ పాత సిలబస్‌ ప్రకారమే పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తన ప్రకటనలో వెల్లడించింది..

AP 10th Class Public Exams: ఆ విద్యార్ధులకు పదోతరగతి పాత సిలబస్‌ ప్రకారంగానే పబ్లిక్‌ పరీక్షలు.. విద్యాశాఖ క్లారిటీ
AP SSC Exams
Follow us

|

Updated on: Sep 08, 2024 | 2:30 PM

అమరావతి, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదో తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే పబ్లిక్‌ పరీక్షల్లో పరీక్షలు పాత సిలబస్‌ ప్రకారంగానే జరుగుతాయని స్పష్టం చేసింది. 2022, 2023, 2024 బ్యాచ్‌లకు చెందిన పదోతరగతి ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని, వీరందరికీ పాత సిలబస్‌ ప్రకారమే పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తన ప్రకటనలో వెల్లడించింది. 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి సిలబస్‌లో మార్పులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ను అన్ని పాఠశాలలకు అమలు చేస్తున్నారు. దీంతో గతంలో పదో తరగతి చదివి ఫెయిలైన విద్యార్థులకు ఏ సిలబస్‌ ప్రకారం పరీక్షలు జరుగుతాయనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో పాత సిలబస్‌ ప్రకారంతోనే పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ట్రాన్స్‌లేటర్స్‌, స్టెనోగ్రాఫర్‌ రాత పరీక్షల తేదీలు వెల్లడి.. త్వరలోనే హాల్ టికెట్లు విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC).. కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్స్‌, స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగా.. పరీక్షల తేదీల వివరాలు నోటిఫికేషన్లలో వెల్లడించలేదు. తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షల నిర్వహణ తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ఎస్సెస్సీ ప్రకటన జారీ చేసింది. కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్స్‌ (పేపర్‌-1) పరీక్ష డిసెంబర్‌ 9న, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-సి అండ్‌ డి పరీక్ష డిసెంబర్‌ 10, 11 తేదీల్లో జరగనున్నాయి. ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT) పద్ధతిలో జరగనున్నాయి. త్వరలో అడ్మిట్‌కార్డులు కూడా జారీ చేస్తారు. కాగా స్టెనోగ్రాఫర్‌ పరీక్ష ద్వారా 2,006 పోస్టులు, హిందీ ట్రాన్స్‌లేటర్స్‌ పరీక్ష ద్వారా 312 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?