Constable Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టెన్త్ అర్హతతో 39,481 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

నిరుద్యోగులకు కేంద్రం భారీ శుభవార్త అందించింది. దేశ రక్షణ దళంలో ఈ సారి కూడా పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ విభాగాల్లో కానిస్టేబుల్(జీడీ) నియామకాలకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్‌ తాజాగా వెలువడింది. గతేడాది 46,617 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయగా.. ఈ ఏడాది 39,481 పోస్టులను తాజా నోటిఫికేషన్‌ కింద భర్తీ కానున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు..

Constable Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టెన్త్ అర్హతతో 39,481 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
Constable Jobs
Follow us

|

Updated on: Sep 06, 2024 | 2:07 PM

నిరుద్యోగులకు కేంద్రం భారీ శుభవార్త అందించింది. దేశ రక్షణ దళంలో ఈ సారి కూడా పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ విభాగాల్లో కానిస్టేబుల్(జీడీ) నియామకాలకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్‌ తాజాగా వెలువడింది. గతేడాది 46,617 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయగా.. ఈ ఏడాది 39,481 పోస్టులను తాజా నోటిఫికేషన్‌ కింద భర్తీ కానున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరుగుతాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. అక్టోబర్‌ 14వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ కానున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకుండా ఉండాలి. అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 14, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తారు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్‌ టెస్ట్స్‌, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి వివిధ సాయుధ బలగాల్లో ఉద్యోగాలు కల్పిస్తారు.

రాత పరీక్ష విధానం..

రాత పరీక్ష మొత్తం 80 ప్రశ్నలకు 160 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌, ఇంగ్లిష్‌/ హిందీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. గంట వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.