TG Gurukul Admissions: పేదింటి విద్యార్ధులకు సదావకాశం.. నేడు, రేపు ఎస్సీ గురుకులాల్లో స్పాట్‌ అడ్మిషన్లు! కోరిన కోర్సులో సీటు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. కొన్ని చోట్ల సీట్లు మిగిలిపోవడంతో.. ఆ మిగిలిన సీట్లకు సెప్టెంబరు 5, 6 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి ఓ ప్రకటనలో తెలిపారు...

TG Gurukul Admissions: పేదింటి విద్యార్ధులకు సదావకాశం.. నేడు, రేపు ఎస్సీ గురుకులాల్లో స్పాట్‌ అడ్మిషన్లు! కోరిన కోర్సులో సీటు
TG Gurukul Admissions
Follow us

|

Updated on: Sep 05, 2024 | 3:02 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. కొన్ని చోట్ల సీట్లు మిగిలిపోవడంతో.. ఆ మిగిలిన సీట్లకు సెప్టెంబరు 5, 6 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో మొత్తం 3,168 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఇందులో ఎస్సీలకు 1,840 సీట్లు, ఎస్సీ-Cలకు 205 సీట్లు, ఎస్టీలకు 300 సీట్లు, బీసీలకు 389 సీట్లు, మైనార్టీలకు 221 సీట్లు, ఈబీసీలకు 213 సీట్లు వరకు అందుబాటులో ఉన్నాట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని గురుకుల డిగ్రీ మహిళా కాలేజీల్లో మొత్తం 2,702 సీట్లు ఖాళీగా ఉన్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి వెల్లడించారు.

సెప్టెంబర్‌ 8న సీపీగెట్‌ తొలి విడత సీట్ల కేటాయిపు.. పూర్తి వివరాలు ఇవే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో సీపీగెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ సీట్లను సెప్టెంబరు 8వ తేదీన కేటాయిస్తామని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఐ.పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. సెప్టెంబరు 4న ఇవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ ప్రక్రియ నాలుగు రోజులు వాయిదా పడిందన్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 18న ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఏఐ కోర్సులో ఉచిత శిక్షణ

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సమాయాత్రం అవుతోంది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఒక్క ఏడాదిలోనే కనీసం లక్ష మంది విద్యార్ధులకు శిక్షణ ఇప్పించేలా ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ‘నెక్స్ట్‌ వేవ్‌’ అనే స్టార్టప్‌ కంపెనీతో ఈ రోజు (సెప్టెంబరు 5) అంతర్జాతీయ ఏఐ సదస్సులో ఒప్పందం చేసుకోనుంది. ఈ సంస్థ ఇప్పటికే దేశంలోని 9 రాష్ట్రాల్లో సేవలను అందిస్తోంది. దాదాపు 2 వేల కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణల్లో మొత్తం 5 లక్షల మందికిపైగా విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇచ్చింది. దీనిపై నెక్స్ట్‌ వేవ్‌ ఫౌండర్, సీఈవో రాహుల్‌ అట్లూరి మాట్లాడుతూ.. సుమారు నెల, రెండు నెలలపాటు శిక్షణ ఉంటుంది. ఇది వర్క్‌షాప్‌లాగా కొనసాగుతుంది. ఏడాదిలో 30 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..శుభవార్త ఎలా చెప్పిందో చూశారా?
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..శుభవార్త ఎలా చెప్పిందో చూశారా?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు