TS 10th Class Results 2023: మరికాసేపట్లో విడుదలకానున్న తెలంగాణ ‘పది’ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో నేరుగా చెక్ చేసుకోండి
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం (మే 10) విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల..
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం (మే 10) విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్ధులు ఫలితాలను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in, https://tv9telugu.com వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు.
కాగా ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 4,84,370 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో తొమ్మిది మంది పాత విద్యార్థులకు సంబంధించి తెలుగు పరీక్ష జవాబుపత్రాల బండిల్ కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ విద్యార్ధులందరినీ అంతర్గత మార్కులు ఆధారంగా పాస్ చేసినట్లు సమాచారం. మరోవైపు ఫలితాల ప్రకటన అనంతరం ఫెయిల్ అయిన విద్యార్ధులు ఎటువంటి అనర్థాలకు పాల్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా అధికారులు తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తున్నారు. నిన్న ఇంటర్ ఫలితాల విడుదల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది విద్యార్ధులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విధితమే.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.