TS EAPCET 2024 Notification: మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 26 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అండ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్ 2024) నోటిఫికేషన్ ఈ రోజు (ఫిబ్రవరి 21) విడుదలకానుంది. ఈ మేరకు కన్వినర్ డాక్టర్ బి డీన్ కుమార్ షెడ్యూల్‌లో పేర్కొన్నారు. షెడ్యల్ ప్రకారం టీఎస్ ఎప్‌సెట్-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ, హైదరాబాద్ విడుదల చేయనుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఎన్టీయూ తెలంగాణ..
హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అండ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్ 2024) నోటిఫికేషన్ ఈ రోజు (ఫిబ్రవరి 21) విడుదలకానుంది. ఈ మేరకు కన్వినర్ డాక్టర్ బి డీన్ కుమార్ షెడ్యూల్‌లో పేర్కొన్నారు. షెడ్యల్ ప్రకారం టీఎస్ ఎప్‌సెట్-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ, హైదరాబాద్ విడుదల చేయనుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఎన్టీయూ తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసి, ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తమ వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. రూ. 250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9వ తేదీ వరకు, రూ. 500 ఆలస్యం రుసుంతో ఏప్రిల్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ. 2500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 19 వరకు, రూ. 5000 ఆలస్య రుసుంతో మే 4వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఏప్రిల్ 8 నుంచి 12వ తేదీ వరకు విద్యార్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
మే 1వ తేదీ నుంచి దరఖాస్తుదారులు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 9, 10వ తేదీల్లో ఇంజినీరింగ్ కోర్సులకు, మే 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ కోర్సులు, ఫార్మసీ కోర్సులకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. మొదటి షిఫ్టు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌కు సంబంధించిన 100 శాతం సిలబస్‌తో తెలంగాణ ఈఏపీసెట్‌ను నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుంది. తెలుగు లేదా ఉర్దూ వెర్షన్‌లోని ప్రశ్నల్లో తేడాలు ఉంటే ఇంగ్లిష్ వెర్షన్‌నే ఫైనల్‌గా తీసుకుంటారు. ఇతర వివరాలు, సందేహాల కోసం 7416923578, 7416908215 హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.