Green Jobs in India: నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. 2025 నాటికి 40 లక్షల ఉద్యోగాలు
దేశ నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రీన్ ఇండస్ట్రీ ద్వారా 18.5 మిలియన్ల వ్యక్తులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ ఉద్యోగాల సంఖ్య వచ్చే 2025 నాటికి 4 మిలియన్లకు పెంచనుంది. భారత్‌లోని హరిత పరిశ్రమ (గ్రీన్ ఇండస్ట్రీ) ప్రస్తుతం 18.5 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తుందని.. 2025 నాటికి హరిత పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని, తద్వారా మొత్తం 4 మిలియన్ల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు..
చెన్నై, ఫిబ్రవరి 21: దేశ నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రీన్ ఇండస్ట్రీ ద్వారా 18.5 మిలియన్ల వ్యక్తులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ ఉద్యోగాల సంఖ్య వచ్చే 2025 నాటికి 4 మిలియన్లకు పెంచనుంది. భారత్‌లోని హరిత పరిశ్రమ (గ్రీన్ ఇండస్ట్రీ) ప్రస్తుతం 18.5 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తుందని.. 2025 నాటికి హరిత పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని, తద్వారా మొత్తం 4 మిలియన్ల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు UKకు చెందిన ఎర్త్‌షాట్ ప్రైజ్ 2023 విజేత, S4S టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకురాలు నిధి పంత్ ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
శిలాజ ఇంధనాల పరివర్తన కారణంగా 2030 నాటికి క్లీన్ ఎనర్జీ, తక్కువ-ఉద్గార సాంకేతికతలలో 30 మిలియన్ల ‘గ్రీన్’ ఉద్యోగాలు సృష్టించబడతాయి. ప్రపంచ బ్యాంకు ప్రకారం.. గ్రీన్ జాబ్ పర్యావరణ లక్ష్యాలను కలిగి ఉంటుంది. గ్రీన్ ఉద్యోగాలు ఒక రంగానికి మాత్రమే పరిమితం కావు. పునరుత్పాదక శక్తి, హరిత ఉత్పత్తులు, తయారీ, స్థిరమైన వ్యవసాయం, వృత్తాకార రీసైక్లింగ్ ఆర్థిక వ్యవస్థల్లో భాగమై ఉంటుంది. సోలార్ ఇంజనీర్ నుంచి ఆర్కిటెక్ట్ వరకు.. వ్యర్థాలను సేకరించే వ్యక్తి వరకు.. గ్రీన్ జాబ్స్ ఉంటాయి. అయితే గ్రీన్ ఉద్యోగాల్లో పునరుత్పాదక ఇంధనం త్వరితగతిన పెరిగింది. మరిన్ని దేశాలు శిలాజ ఇంధనాల నుంచి వైదొలగడంతో.. పునరుత్పాదక ఇంధనాలలో గ్రీన్ జాబ్ ఉపాది అవకాశాలు పెరుగుతున్నాయి.
గ్రీన్ ఎనర్జీని అంగీకరించే విషయంలో భారతదేశం చాలా స్పష్టమైన మార్పును చూస్తోంది. భారతదేశం దాదాపు 180 గిగావాట్ల వ్యవస్థాపిత పునరుత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఇప్పుడు గణనీయ పరిష్కారాల కోసం చూస్తోంది. అంటే శిలాజ ఇంధనాలపై ఆధారపడకుండా పూర్తిగా దూరం అవుతుంది. ప్రపంచంలో ఎలక్ట్రికల్ టూ వీలర్ల అభివృద్ధిలో భారత్ అగ్రగామిగా ఉంది. గృహాలపై సౌర ఫలకాలను అమర్చడానికి మద్దతు ఇచ్చే కొత్త విధానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. రాబోయే దశాబ్దంలో సుస్థిరత, పునరుత్పాదక పరిశ్రమపై ట్రిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఈ విధమైన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ప్రపంచ దేశాలు తమ విద్య వ్యవస్థ, శిక్షణ, పాఠ్యాంశాలలో మార్పు తీసుకురావల్సి ఆవస్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే దీని పరిధి చాలా పెద్దది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.