TS EAMCET Counselling: నేటి నుంచి తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం.. ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి.
TS EAMCET Counselling: కరోనా పరిస్థితుల తర్వాత తెలంగాణలో ఎంసెట్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి.. ఫలితాలను ఈ నెల 25న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే...
TS EAMCET Counselling: కరోనా పరిస్థితుల తర్వాత తెలంగాణలో ఎంసెట్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి.. ఫలితాలను ఈ నెల 25న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి (సోమవారం) రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతోంది. నేటి నుంచి (ఆగస్టు 30) సెప్టెంబర్ 9 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న విద్యార్థులకు రవచ్చే నెల 4 నుంచి 11 వరకు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. సెప్టెంబర్ 15వ తేదీన మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 15 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మొదటి విడత సీట్ల కేటాయింపును సెప్టెంబర్ 15న నిర్వహిస్తారు.
వీటిని తీసుకెళ్లండి..
* ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్. * పర్సనల్ ఈమెయిల్ ఐడీ. * పర్సనల్ మొబైల్ నెంబర్. * పదో తరగతి హాల్ టికెట్ నెంబర్. * కుల ధృవీకరణ సర్టిఫికేట్. * లోకల్ సర్టిఫికేట్.
OTT Platform: ఓటీటీలో పోటీపడి మరీ స్ట్రీమింగ్ అవుతున్న చిన్న సినిమాలు..