AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Variety Names: చరిత్ర అంటే ఇష్టం అంటూ తన పిల్లలకు చైనా రెడ్డి, రష్యా రెడ్డి.. వంటి పేర్లు పెట్టిన వింత తండ్రి.. ఎక్కడంటే

Variety Names: ఇప్పుడు ఉన్న సమాజంలో మీకు పుట్టిన పిల్లల పేర్లు ఏమి పెడతారు.. గతంలో అయితే మగపిల్లలకు విష్ణు సహస్ర నామాల నుంచి ఆడపిల్లలకు అయితే లలితా సహస్ర నామాలనుంచి..

Variety Names: చరిత్ర అంటే ఇష్టం అంటూ తన పిల్లలకు చైనా రెడ్డి, రష్యా రెడ్డి.. వంటి పేర్లు పెట్టిన వింత తండ్రి.. ఎక్కడంటే
Father And Children
Surya Kala
|

Updated on: Aug 30, 2021 | 8:44 AM

Share

Variety Names: ఇప్పుడు ఉన్న సమాజంలో మీకు పుట్టిన పిల్లల పేర్లు ఏమి పెడతారు.. గతంలో అయితే మగపిల్లలకు విష్ణు సహస్ర నామాల నుంచి ఆడపిల్లలకు అయితే లలితా సహస్ర నామాలనుంచి పేర్లను పెట్టేవారు. అయితే కాలం మారింది కాలంతో పాటు మనిషి ఆలోచనలోను మార్పు వచ్చింది. దీంతో ట్రేండింగ్ లో ఏ పేర్లు ఉంటె అవే పెడుతున్నారు. మహేష్ అనో.. పవన్ అనో లేక ట్రెండింగ్ లో ఉన్న పేర్లు పెడతారు.. అయితే ఈ తండ్రి మాత్రం డిఫరెంట్ గా ఆలోచించాడు.  తన పిల్లల పేర్లు “చైనా రెడ్డి”, “రైనా రెడ్డి”, “ఇటలీ రెడ్డి”, “రష్యా రెడ్డి”, “జపాన్ రెడ్డి” వంటి వింత పేర్లు పెట్టాడు. అయితే ఇలాంటి పేర్లు పెడుతున్న గ్రామస్తులు ఉన్నారంటే నమ్ముతారా? నమ్మాలి మరి… ఈ పేర్లన్నీ ఆంధ్రప్రదేశ్ , చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వారివి. ప్రపంచంలో అత్యంత అసాధారణమైన ఈ పేర్లు వెనుకున్న అసలు కథేంటో తెలుసుకుందాం..

 జన్మ నక్షత్రాల ఆధారంగా పేర్లను నిర్ణయించడం భారతీయ సాంప్రదాయం. జనన సమయంలో ఏ నక్షత్రం వున్నదో, ఆ నక్షత్రంలో ఎన్నో పాదం నడుస్తున్నదో చూసి ఆ పాదానికి సూచించిన సంకేతాక్షరం ముందు వచ్చే విధంగా చిన్నారుల పేర్లను నిర్ణయించడం శుభప్రదంగా భావిస్తారు. అలాకాక కొంత మంది తల్లిదండ్రులు వారి పిల్లలకు దేవుని పేర్లు లేదా తాత, ముత్తాల పేర్లు పెట్టుకుంటారు. లేదా తమకు నచ్చిన సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లతో పిలుచుకుంటారు. అయితే చిత్తూరు జిల్లా, జీడీ నెల్లూరు మండలం, మాంబేడు గ్రామానికి చెందిన ఓ రైతు తన ఐదు మంది పిల్లలకు అభివృద్ధి చెందిన దేశాల పేర్లు పెట్టి మురిసిపోతున్నాడు.

గంగాధర నెల్లూరు మండలం, మాంబేడు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఇంటర్ వరకు చదువుకున్నాడు. అదే గ్రామానికి చెందిన ధనలక్ష్మిని వివాహం చేసుకున్నిడు. హిస్టరీ సబ్జెక్ట్ ను అమితంగా ప్రేమించేవాడు చంద్రశేఖర్ రెడ్డి.. తనకున్న కాస్తంత భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చంద్రశేఖర్ రెడ్డి, ధనలక్ష్మి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు సంతానం. తన పిల్లల పేర్లు విభిన్నంగా ఉండాలని మొదటి అమ్మాయి పేరు చైనా రెడ్డిగా నామకరణం చేశాడు. తర్వాత మగ పిల్లవాడికి రైనా రెడ్డి గా‌, మూడవ అమ్మాయికి ఇటలీ రెడ్డి, నాలుగోవ కుమారైకు రష్యా రెడ్డి, చివరి కుమారుడుకు జపాన్ రెడ్డి అని పేర్లు పెట్టాడు. ఈ వింత పేర్లు ద్వారా నలుగురిలో గుర్తింపుతో పాటు ఆ దేశాల చరిత్ర తెలుసుకోవాలనే తపన ఉంటుందని అంటున్నాడు చంద్రశేఖర్ రెడ్డి.

Also Read:

 తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. పొంగిపొర్లుతున్న వాగుులు, వంకలు.. ఇవాళ, రేపు పలుచోట్ల భారీ వర్షాలు..!