SBI ATM Robbery: సీసీ టీవీ ధ్వంసం చేసి మరీ ఏటీఎంలో రూ. 65లక్షలు దొంగతనం చేసిన దుండగులు.. ఎక్కడంటే
SBI ATM Robbery: కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఏటీఎం చోరీ కలకలం రేపింది. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎం లో చోరీ జరిగింది. ఏటీఎం నుంచి డబ్బులు దొంగలించడానికి..
SBI ATM Robbery: కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఏటీఎం చోరీ కలకలం రేపింది. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎం లో చోరీ జరిగింది. ఏటీఎం నుంచి డబ్బులు దొంగలించడానికి దుండగలు గ్యాస్ కట్టర్, గడ్డపారలను ఉపయోగించారు. వీటి సాయంతో రెండు ఏటీఎం మిషన్స్ నుంచి నగదుని దొంగలించారు. అయితే దుండగులు దొంగతనం చేసే సమయంలో అది సీసీటీవీలో రికార్డ్ కాకుండా వాటిని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. దొంగతనం జరిగిన సమయంలో ఏటీఎం లో ఉన్న నగదుకు సంబంధించిన వివరాలను బ్యాక్ అధికారులు తెలిపారు. సుమారు రూ 65 లక్షల రూపాయల వరకు నగదు ఉండవచ్చునని.. బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు ప్రారంభించారు. ఫింగర్ ప్రింట్ ఆధారంగా డాగ్ స్క్వాడ్ లతో తనిఖీ చేస్తున్నారు.