Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీలో జాబ్ మేలా.. నాలుగు సంస్థల్లో 195 ఖాళీలు. పూర్తి వివరాలు..
Job Mela: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఇదొక సదవకాశం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా జాబ్ మేలాను నిర్వహించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 3వ తేదీన...
Job Mela: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఇదొక సదవకాశం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా జాబ్ మేలాను నిర్వహించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 3వ తేదీన ఈ జాబ్ మేలాను నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేలాలో పాల్గొంటోన్న కంపెనీలు ఏవీ, ఏయో ఖాళీలున్నాయి? విద్యార్హతలు ఏంటన్న పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
పాల్గొననున్న కంపెనీలు, భర్తీ చేయనున్న ఖాళీలు..
మోర్ రిటైల్ ఇండియా (30), ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ (15), రైజింగ్ స్టార్స్ హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్‌ఈడీ టీవీ ప్రాజెక్ట్) (100), హీరో మోటో కార్పొరేషన్‌లో 50 ఖాళీలను ఈ జాబ్‌మేలా ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ జాబ్‌మేలాకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతలు..
* మోర్ రిటైల్ ఇండియాలో ఉన్న ఖాళీలకు టెన్త్, ఆపై విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలి. ఇందులో పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలు ఉన్నాయి. ఫుల్ టైం ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 11,500, పార్ట్ టైం ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 6,400 వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు నూజివీడులో పని చేయాల్సి ఉంటుంది.
* ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్‌లో సేల్స్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలకు ఏదైనా డిగ్రీ చేసిన పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు నూజివీడు, గుడివాడలో పని చేయాల్సి ఉంటుంది.
* రైజింగ్ స్టార్స్ హై టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అసెంబ్లింగ్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు పదో తరగతి, ఆపై విద్యార్హత కలిగిన స్త్రీలు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 32 ఏళ్లు ఉండాలి. నెలకు రూ. 10,200 వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు శ్రీ సిటీ, నెల్లూరులో పని చేయాల్సి ఉంటుంది.
* హీరో మోటో కార్పొరేషన్‌లో ప్రాడక్షన్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలకు ఐటీఐ(పురుషులు), ఇంటర్(స్త్రీలు) దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 25 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 14,977 వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు శ్రీ సిటీ, నెల్లూరులో పని చేయాల్సి ఉంటుంది.
జాబ్ మేలా ఎక్కడ నిర్వహించనున్నారు..
* ఈ జాబ్ మేలాను కృష్ణా జిల్లా నూజివీడులోని రైతు బజార్ రోడ్డులో ఉన్న ధర్మ అప్పారావు కాలేజీలో నిర్వహించనున్నారు. * ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం 10 గంటలకు కాలేజీకి చేరుకోవాలి. * పూర్తి వివరాలం కోసం 8374039719, 9848819682 ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించండి.
@AP_Skill has Conducting Skill Connect Drive at @KrishnaDistrict Register at: https://t.co/Sflqq72a6b pic.twitter.com/jmy0uJjwe0
— AP Skill Development (@AP_Skill) August 29, 2021