Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ విద్యుత్‌ సంస్థలో 398 జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 30 నుంచి దరఖాస్తుల ప్రక్రియ.. పూర్తి వివరాలు

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది విద్యుత్‌ సంస్థ. విశాఖపట్నంలోని ఈస్టర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (APEPDCL)..

ఏపీ విద్యుత్‌ సంస్థలో 398 జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 30 నుంచి దరఖాస్తుల ప్రక్రియ.. పూర్తి వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Aug 29, 2021 | 9:09 PM

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది విద్యుత్‌ సంస్థ. విశాఖపట్నంలోని ఈస్టర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (APEPDCL) గ్రామ, వార్డు సచివాలయాల కింద వివిధ జిల్లాల్లో పనిచేయడానికి 398 ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌-2) పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ చెక్‌ చేసుకోవాలి.

మొత్తం పోస్టులు: 398 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 30, 2021 వెబ్‌సైట్‌:

కాగా, ఇవే కాకుండా ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో ఆయా రంగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసే పనిలో పడ్డారు అధికారులు. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ఉండటం కారణంగా ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ లేదు. తాజాగా కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఆయా రంగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ పలు సంస్థల్లో భారీగా ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. టీసీఎల్, రైసింగ్ స్టార్స్, హీరో మోటార్ గ్రూప్స్, టెక్ టీమ్ సొల్యూషన్స్, వీల్స్ మార్ట్ తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలున్నాయి. ఈ మేరకు అర్జులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చాలా ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. మంచి చదువులు చదివి ఉద్యోగాలు రాని వారు ఎలాంటి నిరాశ పడకుండా ఉద్యోగాల కోసం ట్రై చేస్తే ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది.

ఇవీ కూడా చదవండి:

Telangana Schools: సెప్టెంబర్ 1న స్కూల్స్ షురూ.. శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాలలు.. సమస్యలు, సవాళ్ల మధ్య పిల్లలు బడిబాట

New India Assurance: న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేలకుపైగా జీతం పొందే అవకాశం.