New India Assurance: న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేలకుపైగా జీతం పొందే అవకాశం.

New India Assurance Recruitment: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ది న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది...

New India Assurance: న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేలకుపైగా జీతం పొందే అవకాశం.
New India Assurance
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 29, 2021 | 6:36 PM

New India Assurance Recruitment: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ది న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా 300 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు (జనరలిస్టులు) (స్కేల్‌-1) పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. చివరి ఏడాది/ సెమిస్టర్‌ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. * అభ్యర్థుల వయసు 01.04.2021 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులకు మొదట ప్రిలిమినీరీ టెస్ట్‌, మెయిన్‌ ఎగ్జామ్‌ (అబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌) పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించి వారిని ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. * ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.32795 నుంచి రూ.62315 జీతంగా చెల్లిస్తారు. * ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.100, ఇతర అభ్యర్థులు రూ.750 పరీక్ష ఫీజులగా చెల్లించాల్సి ఉంటుంది. * దరఖాస్తుల ప్రక్రియ 01-09-2021 నుంచి మొదలవుతుండగా 21.09.2021తో ముగియనుంది. * మొదటి ఫేజ్‌ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ అక్టోబర్‌లో రెండో ఫేజ్‌ ఆన్‌లైన్‌ పరీక్షను నవంబర్‌లో నిర్వహించనున్నారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: మరోసారి పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌.. అమెరికా సైనికులే టార్గెట్‌గా రాకెట్లతో దాడి

Motkupalli: ‘దళిత బంధు అమలు కాకపోతే యాదాద్రిలో ఆత్మహత్య, అతనొక రాజకీయ బ్రోకర్..’ మోత్కుపల్లి కొత్త టర్న్

Krithi Sanon: ప్రభాస్ గురించి షాకింగ్ విషయాలను చెప్పిన స్టార్ హీరోయిన్.. అందరూ అనుకునేవి నిజం కాదంటూ..