Krithi Sanon: ప్రభాస్ గురించి షాకింగ్ విషయాలను చెప్పిన స్టార్ హీరోయిన్.. అందరూ అనుకునేవి నిజం కాదంటూ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు యూత్‏లో క్రేజ్ ఉన్న హీరో.. అమ్మాయిల కళల రాకుమారుడు.. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా

Krithi Sanon: ప్రభాస్ గురించి షాకింగ్ విషయాలను చెప్పిన స్టార్ హీరోయిన్.. అందరూ అనుకునేవి నిజం కాదంటూ..
Prabhas
Follow us

|

Updated on: Aug 29, 2021 | 6:17 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు యూత్‏లో క్రేజ్ ఉన్న హీరో.. అమ్మాయిల కళల రాకుమారుడు.. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో స్టార్‏డమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్… చేతి నిండా పాన్ ఇండియా చిత్రాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. అలాగే ప్రభాస్‏తో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఈ స్టార్ హీరో కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితోపాటు… బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుల ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. రామాయణ మహాగాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతుండగా.. కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతుంది. ఇక మరో స్టార హీరో సైఫ్ అలీఖాన్ ఇందులో రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

Krithi Sanon

Krithi Sanon

తాజాగా హీరోయిన్ కృతి సనన్ ఆదిపురుష్ సినిమాలో తన రోల్ గురించి మాట్లాడుతూ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ప్రభాస్‏తో కలిసి నటించడం.. అది కూడా సీత పాత్ర చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది కృతి సనన్. ప్రభాస్ చాలా పొడుగ్గా ఉంటాడు.. ముఖ్యం అతను ప్రొఫెషనల్ దుస్తుల్లో ఉన్నప్పుడు తమ జంట బాగుంటుందని తెలిపింది. మొదటి షెడ్యూల్లో తొలిసారి తనతో కలిసి షూటింగ్‏లో పాల్గొన్నానని.. ఇప్పుడు తనతో మరోసారి షెడ్యూ్ల్ చేయబోతున్నట్లుగా కృతి సనన్ తెలిపింది. ప్రభాస్ భోజన ప్రియుడు.. అంతేకాకుండా.. చాలా సరదాగా ఉంటాడు.. చాలా మంది అతనికి బిడియం ఎక్కువ అనుకుంటారు. కానీ అది నిజం కాదు… ఒక్కసారి మాట్లాడి పరిచయం పెరిగితే అతను ఎంతో బాగా మాట్లాడుతాడు.. అతనితో స్నేహం నాకు నచ్చింది అంటూ చెప్పుకొచ్చింది కృతి సనన్.

టీ సిరీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆదిపురుష్ సినిమాను భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Also Read: Shanmukh Jaswanth: ఇది ప్రమోషనల్ పోస్ట్ కాదంటునే ఆ సంస్థపై పొగడ్తల వర్షం కురిపించిన షణ్ముఖ్.. జాగ్రత్త అంటున్న నెటిజన్స్..

Bommarillu: ఆ రోజు సెట్‌లో బన్నీ లేకుంటే బొమ్మరిల్లులో జెనీలియా నటించేది కాదు.. ఒక్క సీన్‌ కోసం రాత్రంతా.