AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanmukh Jaswanth: ఇది ప్రమోషనల్ పోస్ట్ కాదంటునే ఆ సంస్థపై పొగడ్తల వర్షం కురిపించిన షణ్ముఖ్.. జాగ్రత్త అంటున్న నెటిజన్స్..

షణ్ముఖ్ జశ్వంత్.. పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియాలో షణ్ముఖ్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే.

Shanmukh Jaswanth: ఇది ప్రమోషనల్ పోస్ట్ కాదంటునే ఆ సంస్థపై పొగడ్తల వర్షం కురిపించిన షణ్ముఖ్.. జాగ్రత్త అంటున్న నెటిజన్స్..
Shanmukh Jaswanth
Rajitha Chanti
|

Updated on: Aug 29, 2021 | 5:44 PM

Share

షణ్ముఖ్ జశ్వంత్.. పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియాలో షణ్ముఖ్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. యూట్యూబ్‏లో షణ్ముఖ్ వీడియోలను ఇష్టపడే వారు లక్షల్లో ఉంటారు. సాఫ్ట్‏వేర్ డెవలపర్ సిరీస్‏తో యూత్‏కు మిస్టర్ షన్నుగా దగ్గరయ్యాడు. ఈ సిరీస్ యూట్యూబ్‏లో సంచలనం సృష్టించింది. ఇక ఈ సిరీస్ తర్వాత ఇటీవల సూర్య వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‏తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు షన్ను. నటనతో.. ఎమోషనల్ సన్నివేశాలలో షన్ను నటనకు కేవలం యూత్ మాత్రమే కాదు… ఫ్యామిలీ ఆడియన్స్ సైతం అట్రాక్ట్ కావాల్సిందే. ఇంతటి ఫాలోయింగ్ ఉన్న షన్ను పేరు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా షణ్ముఖ్ పేరు నెట్టింట్లో మారుమోగిపోతుంది. త్వరలో ప్రారంభమయ్యే బిగ్‏బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ పాల్గొంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇటీవల లీకైన బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ జాబితాలో షణ్ముఖ్ పేరు ఉందని… గతంలో కూడా ఈ యూట్యూబ్ స్టార్‏ను బిగ్‎బాస్ నిర్వాహకులు సంప్రదించగా.. షణ్ముఖ్ నిరాకరించాడని.. కానీ ఈసారి హౌస్‏లోకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. షణ్ముఖ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో తెలిసిన విషయమే. నిత్యం తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో నెట్టింట్లో రచ్చ చేస్తుంటారు. ఆ మధ్య న్యూకార్ కొనుకున్నానని…. త్వరలోనే డ్రైవర్‏ను కూడా పెట్టుకుంటాను అంటూ ట్వీట్ చేశాడు షన్ను. దీంతో నెటిజన్స్ ఓ ఆటాడుకున్నారు. గతంలో తాగి కారు యాక్సిడెంట్ చేసిన సంఘటనలను గుర్తుచేస్తూ ట్రోల్ చేశారు. అయితే తాజాగా షణ్ముఖ్ తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పి అందరికి షాకిచ్చాడు. తనకు దంత సమస్యలు వచ్చాయిని… గడిచిన నాలుగు నెలల్లో రెండుసార్లు ఇంప్లాంట్స్ జరిగాయని.. రూట్ కెనాల్ సులభంగా ఉండదని చెప్పుకొచ్చారు. ఎంతో నొప్పిగా.. వాపుగా ఉంటుందని కానీ ఓరో కెర్ డెంటల్ క్లినిక్ వలన ఎంతో త్వరగా రికవరీ అయ్యానని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. నోట్ అని మెన్షన్ చెస్తూ… ఇది ఆ క్లినిక్‏కు ప్రమోషన్ పోస్ట్ కాదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక షణ్ముఖ్ పోస్ట్ పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు…

ట్వీట్..

Also Read: Bommarillu: ఆ రోజు సెట్‌లో బన్నీ లేకుంటే బొమ్మరిల్లులో జెనీలియా నటించేది కాదు.. ఒక్క సీన్‌ కోసం రాత్రంతా.

Rashmika Mandanna: మిషన్ మజ్ను పై ఆసక్తికర ట్వీట్ చేసిన రష్మిక.. ఫోటో వైరల్..