AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: మిషన్ మజ్ను పై ఆసక్తికర ట్వీట్ చేసిన రష్మిక.. ఫోటో వైరల్..

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది రష్మిక మందన్న..ఆ తర్వాత గీతా గోవిందం వంటి సూపర్ హిట్

Rashmika Mandanna: మిషన్ మజ్ను పై ఆసక్తికర ట్వీట్ చేసిన రష్మిక.. ఫోటో వైరల్..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Aug 29, 2021 | 4:06 PM

Share

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది రష్మిక మందన్న..ఆ తర్వాత గీతా గోవిందం వంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత రష్మిక ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్స్ రేసులో కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న రష్మిక.. సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అటు తమిళ్, కన్నడతోపాటు… తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమాలో నటిస్తోంది. అలాగే శర్వానంద్ హీరోగా రాబోతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు అనే మూవీ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు దక్షిణాది ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రష్మిక.. ఇప్పుడు బాలీవుడ్‏పై ఆసక్తి చూపిస్తుంది. మిషన్ మజ్ను సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇదే కాకుండా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‏తో కలిసి గుడ్ బై సినిమాలోనూ నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా లోకెషన్ నుంచి అమితాబ్ రష్మిక ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ అమ్మడు ఇప్పుడు మిషన్ మజ్ను సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా తెలిపింది. ఈ విషయాన్ని రష్మిక తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఇది ముగింపు… మిస్టర్ మజ్ను కోసం నేను అందమైన సమయాన్ని గడిపాను. నేను నా మొదటి హిందీ సినిమాను ముగించాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేను స్క్రిప్ట్ విన్న సమయం నాకు గుర్తుంది.. మొదటిసారి నేను ఇలా వెళ్లాను. నేను ఈ అందమైన సినిమాలో భాగం కావాలనుకునంటున్నాను అంటూ ట్వీట్ చేసింది రష్మిక.. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా, షరీబ్ హష్మి, పర్మీత్ సేథి, అనంత్ మహాదేవన్, కుముద్ మిశ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Sitara: మళ్లీ సందడి మొదలుపెట్టిన బెస్ట్ ఫ్రెండ్స్.. గోవా డైరీస్ అంటూ వచ్చేసిన ఏ అండ్ ఎస్..

Samantha: ఒక్క ట్వీట్‏తో రూమర్స్‏కు చెక్ పెట్టిన సామ్.. ఏమని ట్వీట్ చేసిందంటే..

Follow Us
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!