Sitara: మళ్లీ సందడి మొదలుపెట్టిన బెస్ట్ ఫ్రెండ్స్.. గోవా డైరీస్ అంటూ వచ్చేసిన ఏ అండ్ ఎస్..

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముద్దు ముద్దు మాటలతో ఇప్పటికే

Sitara: మళ్లీ సందడి మొదలుపెట్టిన బెస్ట్ ఫ్రెండ్స్.. గోవా డైరీస్ అంటూ వచ్చేసిన ఏ అండ్ ఎస్..
Sitara
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 29, 2021 | 3:32 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముద్దు ముద్దు మాటలతో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది సితార. ఇప్పటికే ఈ చిన్నారికి సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. తన బ్యూటీఫుల్ ఫోటోలతోపాటు.. అల్లరి వీడియోలు నెట్టింట్లో హల్‏చల్ చేస్తుంటాయి. ఇటీవల 9వ బర్త్ డే జరుపుకున్న సితార అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కేవలం ఇన్‏స్టాలో యాక్టివ్‏గా సితార సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది. తన ప్రాణ స్నేహితురాలు.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుమార్తెతో కలిసి ఏ అండ్ ఎస్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది సితార. అందులో పిల్లలను ఎంటర్‏టైన్ చేసే ఫన్నీ వీడియోలు, గేమ్స్, టాస్క్‏లు, ఛాలెంజెస్ వంటివి అప్‏లోడ్ చేస్తుంటారు. వీరి ఛానల్‏కు లక్షకు పైగా సబ్‏స్క్రైబర్స్ ఉన్నారు.

ఈ ఛానల్లో వీరిద్దరు కలసి గతంలో హీరోహీరోయిన్లకు సైతం ఇంటర్వ్యూ చేశారు. అందులో మహేష్ బాబు, రష్మిక మందన్నాను కూడా ఇంటర్వ్యూ చేశారు ఈ సూపర్ కిడ్స్. అయితే గత కొద్దిరోజులుగా వీరిద్ధరికి సంబంధించిన వీడియోలు అప్‏లోడ్ కాలేదు. తాజాగా వీరిద్దరు కలిసి గోవా డైరీస్ అంటూ కెమెరా ముందుకు వచ్చారు. ట్రావెల్ టేల్స్ పేరుతో గోవా టూర్‏కు సంబంధించిన విషయాలను చెబుతున్న వీడియోను షేర్ చేశారు ఈ కిడ్స్. ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ కోసం గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్‏తోపాటు ఆయన కుటుంబం మొత్తం గోవా వెళ్లారు. వీరితోపాటు… డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుటుంబం కూడా గోవా వెళ్లారు. అక్కడ గడిపిన క్షణాలను సితార, ఆద్య ఇద్దరూ గోవా డైరీస్ రూపంలో తమ యూట్యూబ్ ఛానల్‏లో షేర్ చేశారు. రెస్టారెంట్ కి వెళ్లి బ్రెడ్ తీసుకొచ్చి బాతులకు పెట్టడం దగ్గర నుంచి.. బీచ్ కు వెళ్లి ఎంజాయ్ చేసే వరకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వీడియోను మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇది ఎలా మొదలైంది. నాకు ఇష్టమైన జోడి తిరిగి వచ్చింది. ఈసారి మమ్మల్ని గోవాకు తీసుకెళ్లారు. ఎప్పటిలాగే ఈ వీడియో నచ్చింది. రాక్ మై గర్ల్స్ .. అని ట్వీట్ చేశారు.

వీడియో..

ట్వీట్..

Also Read: Samantha: ఒక్క ట్వీట్‏తో రూమర్స్‏కు చెక్ పెట్టిన సామ్.. ఏమని ట్వీట్ చేసిందంటే..

Nagarjuna: నాగార్జున కొత్త సినిమా టైటిల్‌ వచ్చేసింది.. ఆకట్టుకుంటోన్న నాగ్‌ లుక్‌. లండన్‌ నేపథ్యంలో..

Nagarjuna: డెవిల్ ఈజ్ బ్యాక్.. స్వర్గం నుంచి దిగివస్తున్న బంగార్రాజు.. నాగ్ ఫస్ట్‏లుక్ అదుర్స్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!