AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: నాగార్జున కొత్త సినిమా టైటిల్‌ వచ్చేసింది.. ఆకట్టుకుంటోన్న నాగ్‌ లుక్‌. లండన్‌ నేపథ్యంలో..

Nagarjuna: మారుతోన్న కాలానికి అనుగుణంగా సరికొత్త కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 35 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ...

Nagarjuna: నాగార్జున కొత్త సినిమా టైటిల్‌ వచ్చేసింది.. ఆకట్టుకుంటోన్న నాగ్‌ లుక్‌. లండన్‌ నేపథ్యంలో..
Nagarjuna Ghost
Narender Vaitla
|

Updated on: Aug 29, 2021 | 2:46 PM

Share

Nagarjuna: మారుతోన్న కాలానికి అనుగుణంగా సరికొత్త కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 35 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ యంగ్‌ హీరోలకు పోటీగా సినిమాలు తీస్తున్నారు. ఒకే కథాంశానికి పరిమితం కాకుండా రకరకాల సబ్జెక్ట్‌లను టచ్‌ చేస్తున్నారు నాగ్‌. టాలీవుడ్‌ మన్మథుడిగా పేరు సంపాదించుకున్న నాగార్జున పుట్టిన రోజు నేడు (ఆదివారం). ఈ రోజుతో నాగార్జున 62వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే నాగ్‌ జన్మదినం సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లు సైతం వస్తున్నాయి.

ఇందులో భాగంగానే ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘ఘోస్ట్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వర్షంలో కత్తి పట్టుకొని యాక్షన్‌లో లుక్‌లో కనిపిస్తున్నారు నాగ్. ఇక నాగ్‌ ముందుకు కొందరు భయపడుతూ ఉన్నట్లు ఉన్న ఓ మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

ఇక ఈ ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే.. ఈ సినిమా లండన్‌ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్‌కు జంటగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇదిలా ఉంటే కాజల్‌ అగర్వాల్‌ నాగచైతన్యతో ‘దడ’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇలా తనయుడితో ఆడిపాడి కాజల్‌ ఇప్పుడు తండ్రితోనూ చిందులు వేయనుందన్నమాట.

Also Read: Zodiac Signs: మీ రహస్యాలను ఈ రాశులవారికి చెప్పారో.. ఇక అంతే.. మీరు బజారున పడ్డట్టే..

Post Covid Symptoms: పిల్లల్లో పోస్ట్ కొవిడ్‌ లక్షణాలు..! కేరళలో పెరుగుతున్న MIS-C కేసులు

Divorce: వైవాహిక బంధం నుంచి విడిపోవాలని అనుకుంటున్నారా.. కాస్త ఆగండి.. ఇలా చేస్తే మీ బంధం నిలబడవచ్చు