TTD Meals: తిరుమల సంప్రదాయ భోజనంపై టీటీడీ ఛైర్మన్ సంచలన నిర్ణయం.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్!

TTD Traditional Meals: తిరుమల సంప్రదాయ భోజనంపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

TTD Meals: తిరుమల సంప్రదాయ భోజనంపై టీటీడీ ఛైర్మన్ సంచలన నిర్ణయం.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్!
Ttd Traditional Meals
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 30, 2021 | 9:00 AM

TTD Traditional Meals: హెచ్చరించారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న నిత్యాన్నదానం నిరంతరాయంగా కొనసాగుతుందని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామి వారి నిత్యాన్నదానాన్ని స్వీకరించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటోంది.

అయితే, తిరుమలలో సాంప్రదాయ భోజనం కార్యక్రమాన్ని నిలిపివేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. పాలకమండలి లేని సమయంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరణ ఇచ్చారు. తిరుమలలో భక్తులకు ప్రసాదంగానే భోజనాన్ని అందించాలి తప్పా.. అన్నప్రసాదానికి భక్తుల నుంచి నగదు స్వీకరించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ భోజనం విధానంను తక్షణమే నిలిపివేశేలా అదేశిస్తానని స్పష్టం చేశారు.

ఇదిలావుంటే, తిరుమల శ్రీవారి భక్తులకు గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇది విజయవంతమైతే ఈ భోజనం తయారీకి ఎంత ఖర్చు అవుతుందో అంత మాత్రమే (కాస్ట్‌ టు కాస్ట్‌) భక్తుల నుంచి స్వీకరించనుంది. కానీ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి భక్తులకు లాభాపేక్ష లేకుండా రుచికరమైన గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని అందించాలనే లక్ష్యంతోనే ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని.. భక్తులు, దాతలు అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది టీటీడీ. అలాగే, గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో అన్నప్రసాదాలను తయారు చేసి.. తిరుమలలోని అన్నమయ్య భవనంలో వడ్డించారు.

ఇప్పటికే గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పదార్థాలతో శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. ఇకపై భక్తులకు కూడా ఈ సంప్రదాయ భోజనాన్ని కాస్ట్‌ టు కాస్ట్‌ (ఎంత ఖర్చు అయితే అంత) సేల్‌ విధానంలో అందించాలని అధికారులు నిర్ణయించారు. అన్నం, కొబ్బరి అన్నం, పులిహోరా, బోండా, వడ, ఉప్మా, ఇడ్లీ, పప్పు, సాంబారు, రసం, పూర్ణాలు, పచ్చడి, పెరుగు, నెయ్యి.. మొత్తంగా 14 రకాల ఆహార పదార్థాలను వడ్డించారు.దేశీయ ఆవుల ఎరువుతో పండించిన పంటలతో వీటిని తయారు చేశారు. వీటిలో వ్యాధినిరోధకతను పెంపొందించే సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 8వ తేదీ వరకు గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, భక్తుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించాలని భావించారు. అయితే, తాజాగా విమర్శలు వెల్లువెత్తడంతో తాత్కాలికంగా సంప్రదాయ భోజనాన్ని నిలిపివేస్తున్నట్లు ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

Read Also…  TS EAMCET Counselling: నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం.. ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి.

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్