TS DSC 2024 Latest Update: తెలంగాణ డీఎస్సీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు.. చివర తేదీ ఇదే!

డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలన్న నిరుద్యోగుల డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం గురువారం (మార్చి 14) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనుమతి తెలిపిన నిమిషాల వ్యవధిలోనే తెలంగాణ సర్కార్‌ టెట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించింది. అలాగే దరఖాస్తు గడువునూ పెంచింది. తొలుత ప్రకటించిన నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్‌ 4వ తేదీతో..

TS DSC 2024 Latest Update: తెలంగాణ డీఎస్సీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు.. చివర తేదీ ఇదే!
TS DSC 2024
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 15, 2024 | 4:38 PM

హైదరాబాద్‌, మార్చి 15: డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలన్న నిరుద్యోగుల డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం గురువారం (మార్చి 14) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనుమతి తెలిపిన నిమిషాల వ్యవధిలోనే తెలంగాణ సర్కార్‌ టెట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించింది. అలాగే దరఖాస్తు గడువునూ పెంచింది. తొలుత ప్రకటించిన నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్‌ 4వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగుస్తుంది.

అయితే తాజా ప్రకటనలో జూన్‌ 20 వరకు దరఖాస్తు గడువు పొడిగించింది. ఇక జులై 17 నుంచి 31 ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్‌ వెల్లడించారు. తాజాగా టెట్‌ నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది.

కాగా తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ గత నెల 29న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 4 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డీఎస్సీ రాయాలంటే ముందుగా టెట్‌లో అర్హత సాధించాలి. పైగా టెట్‌లో సాధించిన మార్కుల్లో డీఎస్సీకి 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో ఈ ఏడాదికి టెట్‌ నిర్వహించకపోవడంతో డీఎస్సీ 2024కి దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోతామని డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఆందోళన పడ్డారు. దీనిపై స్పందించిన సర్కార్ డీఎస్సీకి ముందే టెట్‌ నిర్వహణకు ప్రకటన వెలువరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.