Telangana DOST: తెలంగాణ‌లో డిగ్రీ ప్ర‌వేశాల‌కు దోస్త్ నోటిఫికేషన్ విడుద‌ల‌… పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

Telangana DOST: తెలంగాణ రాష్ట్రంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌డం, ఫ‌లితాల‌ను సైతం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌వేశాల కోసం దోస్త్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. రాష్ట్రంలోని...

Telangana DOST: తెలంగాణ‌లో డిగ్రీ ప్ర‌వేశాల‌కు దోస్త్ నోటిఫికేషన్ విడుద‌ల‌... పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..
Telangana Dost
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 29, 2021 | 4:02 PM

Telangana DOST: తెలంగాణ రాష్ట్రంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌డం, ఫ‌లితాల‌ను సైతం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌వేశాల కోసం దోస్త్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. రాష్ట్రంలోని ప‌లు క‌ళాశాల్లో ఉన్న బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. అభ్య‌ర్థులు రూ. 200 చెల్లించి రిజిస్ట్రేష‌న్ చేసుకొని.. దోస్త్ ఐడిని పొందాల్సి ఉంటుంది. విద్యార్థులు సందేహాల‌ను నివృత్తి చేసుకోవ‌డం కోసం రాష్త్ర వ్యాప్తంగా 105 హెల్ప్ లైన్ సెంట‌ర్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఇక దోస్త్‌లో న‌మోదు చేసుకోవ‌డానికి ఆధార్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. రూ. 200 ఫీజుతో 01-07-2021 నుంచి 15-07-2021 వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు. విద్యార్థులు వెబ్ ఆప్ష‌న్ల‌ను ఫేస్‌-1లో 03-07-2021 నుంచి 16-07-2021 వ‌ర‌కు ఇచ్చుకోవ‌చ్చు. ఇక ఫేస్ వ‌న్ సీట్ల‌ను 22-07-2021 తేదీని ప్ర‌క‌టిస్తారు. అలాగే ఫేస్‌-IIలో రిజిస్ట్రేష‌న్ చేసుకునే వారు రూ. 400 రుసుముతో 23-07-2021 నుంచి 27-07-2021 చేసుకోవ‌చ్చు. ఫేస్‌-II వెబ్ ఆప్ష‌న్స్ 24-07-2021 నుంచి 29-07-2021 వ‌ర‌కు ఉంటాయి. ఇక ఫేస్‌-II సీట్లను 04-08-2021న కేటాయిస్తారు. ఫేస్‌-III రిజిస్ట్రేష‌న్ విష‌యానికొస్తే.. రూ. 400 రుసుముతో 05-08-2021 నుంచి 10-08-2021 వ‌ర‌కు చేసుకోవ‌చ్చు. ఫేస్‌-III వెబ్ ఆప్ష‌న్స్‌ను 09-08-2021 నుంచి 11-08-2021 వ‌ర‌కు ఎంచుకోవ‌చ్చు. సీట్ల‌ను 18-08-2021న కేటాయిస్తారు. మూడు ఫేజుల్లో సీట్లు ధృవీక‌రించిన విద్యార్థులు 18-08-2021 నుంచి 31-08-2021 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. త‌ర‌గ‌తులు 01-09-2021 నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.

Also Read: Medak Farmer: మెదక్‌ జిల్లాలో రైతు ఆగ్రహం.. తనతో పాటు తహశీల్దార్‌పై డీజిల్‌ పోసి నిరసన.. సిబ్బంది అప్రమత్తంతో తప్పిన ముప్పు

MLA Seethakka: రేవంత్ రెడ్డి కోసం సీతక్క మొక్కులు.. మేడారంలో సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు

జీహెచ్ఎంసీ కార్యాలయానికి పీసీసీ చీఫ్.. శుభాకాంక్షలు తెలిపిన మేయర్ గద్వాల విజయలక్ష్మి

బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అవాక్కే..
పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అవాక్కే..
శీతాకాలం.. రోగాల కాలం.. ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
శీతాకాలం.. రోగాల కాలం.. ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
సంజు శాంసన్ త్యాగం..ఆ యువ ఆటగాడికి వికెట్ కీపింగ్ బాధ్యతలు!
సంజు శాంసన్ త్యాగం..ఆ యువ ఆటగాడికి వికెట్ కీపింగ్ బాధ్యతలు!