NRI Deposits: స్వదేశానికి సొమ్ములు పంపే ఎన్నారైలలో కేరళీయులే నెం.1.. ఎంత పంపారో తెలుసా?

స్వదేశానికి సొమ్ములు పంపే ఎన్నారైలలో కేరళా ఎన్నారైలే ముందున్నారు. స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) నివేదిక ప్రకారం...కేరళ రాష్ట్రానికి చెందిన ఎన్నారైలు 2020 సంవత్సరంలో  రూ.2.27 లక్షల కోట్ల డిపాజిట్లు పంపారు.

NRI Deposits: స్వదేశానికి సొమ్ములు పంపే ఎన్నారైలలో కేరళీయులే నెం.1.. ఎంత పంపారో తెలుసా?
NRI Deposits
Follow us

|

Updated on: Jun 29, 2021 | 1:53 PM

స్వదేశానికి సొమ్ములు పంపే ఎన్నారైలలో కేరళా ఎన్నారైలే ముందున్నారు. కరోనా కష్టకాలంలోనూ తమ సంపాదనను భారీగా కేరళలోని తమ వారి కోసం పంపారు. స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) నివేదిక ప్రకారం…కేరళ రాష్ట్రానికి చెందిన ఎన్నారైలు 2020 సంవత్సరంలో  రూ.2.27 లక్షల కోట్ల డిపాజిట్లు పంపారు. మునుపటి సంవత్సరంతో పోలిస్తే డిపాజిట్లు 14 శాతం పెరిగాయి. 2019 సంవత్సరంలో కేరళ ఎన్నారైల నుంచి మొత్తం 1,99,781 కోట్ల డిపాజిట్లు రాగా…2020 సంవత్సరంలో అదనంగా 27,649 కోట్లు వచ్చింది. ఎన్నారైల నుంచి వస్తున్న డిపాజిట్లలో కేరళ నుంచే ఎక్కువ. ఎందుకంటే, మిగిలిన అన్ని రాష్ట్రాలకంటే అధికంగా దాదాపు 40 లక్షల మంది కేరళీయులు విదేశాలలో నివసిస్తున్నారు. వీరు ఏటా వేల కోట్ల రూపాయలు స్వదేశంలోని తమవారికి పంపుతుంటారు

బ్యాంకులలో డిపాజిట్‌ చేస్తున్నవే కాకుండా మొత్తంగా దేశానికి పంపిస్తున్న డబ్బులలో కూడా కేరళ ఎన్నారైలదే అధిక వాటా ఉంది. 2018లో భారత రిజర్వు బ్యాంకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం…విదేశాలలో స్థిరపడిన భారతీయులు తమ దేశానికి పంపిస్తున్న సొమ్ములో 19 శాతం వాటా కేరళీయులదే కావడం విశేషం.

ఎన్నారై రెమిటెన్స్‌లో టాప్‌-10 రాష్ట్రాలు.. రాష్ట్రం మొత్తంలో రెమిటెన్స్‌లో రాష్ట్రం వాటా (%) 1. కేరళ 19.0 2. మహారాష్ట్ర 16.7 3. కర్ణాటక 15.0 4. తమిళనాడు 8.0 5. ఢిల్లీ 5.9 6. ఆంధ్రప్రదేశ్‌ 4.0 7. ఉత్తరప్రదేశ్‌ 3.1 8. పశ్చిమబెంగాల్‌ 2.7 9. గుజరాత్‌ 2.1 10.పంజాబ్‌ 1.7

రోజుకి 1,670 కోట్లు… ఇది విదేశాలలోని మనవాళ్లు మనకు పంపుతున్న డబ్బు. కరోనా విలయంలో కూడా విదేశాలలోని భారతీయులు భారతదేశంలోని తమవారికి భారీగా డబ్బు పంపిస్తూనే ఉన్నారు. జీవనోపాధి కోసం విదేశాల్లో పని చేస్తున్న భారత సంతతి వ్యక్తులు తాము సంపాదించిన దాంట్లో కొంత తమ కుటుంబాలు, సన్నిహితులకు పంపిస్తారు. వీటినే రెమిటెన్స్‌ అంటారు. ప్రపంచ బ్యాంకు తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ విషయంలో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్ అగ్రస్థానంలో ఉంది. విదేశాల్లో ఉన్న భారతీయులు 2020లో భారత దేశానికి పంపిన మొత్తం 83.1 బిలియన్ డాలర్లు (దాదాపు 6లక్షల కోట్లు). అంతకు మందు సంవత్సరం 2019లో ఈ విధంగా వచ్చిన రెమిటెన్స్‌ మొత్తం 83.3 బిలియన్ డాలర్లు. అంటే అంతకు మందు సంవత్సరంతో పోలిస్తే కేవలం 0.3 బిలియన్‌ డాలర్లు మాత్రమే తగ్గాయి. ఇందులో కూడా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లోని భారతీయులు పంపే డబ్బులోనే దాదాపు 17 శాతం కోత పడింది. గత సంవత్సరంతో పోలిస్తే పాకిస్తానకు వచ్చిన రెమిటెన్స్‌ 2020లో పెరగడం విశేషం. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియా, యూరప్‌ దేశాలనుంచీ పాకిస్తాన్ కు రెమిటెన్స్‌ పెరగడమే దీనికి కారణం.

2020లో అన్నిదేశాలూ కరోనాతో అతలాకుతలమై, చైనాతో సహా వివిధ దేశాలకు వచ్చే రెమిటెన్స్‌ తగ్గాయి. కానీ భారతీయులు పంపిన రెమిటెన్స్‌ 2019తో పోలిస్తే 0.2 శాతం మాత్రమే తగ్గాయి. 2020లో వివిధ దేశాలకు వచ్చిన రెమిటెన్స్‌ను పరిశీలిస్తే ఇండియా తరువాతి స్థానంలో చైనా, మెక్సికో ఉన్నాయి. 2020లో చైనీయులు తమ దేశానికి 59.5 బిలియన్ డాలర్లు రెమిటెన్స్ పంపారు.  మెక్సికోకు  42.8 బిలియన్ డాలర్లు రెమిటెన్స్‌ వచ్చాయి.

ఏ దేశం నుంచీ ఎంత వెళ్లాయి…? ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాలకు ఇతర దేశాలలోని తమవారు పంపే రెమిటెన్స్‌ (చెల్లింపులు) 2020 లో 540 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది 2019 లో వచ్చిన 548 బిలియన్ల కంటే 1.6 శాతం మాత్రమే తక్కువ. వీటిలోకూడా అమెరికాలోని స్థిరపడిన విదేశీయులు తమ దేశాలకు పంపినవే అత్యధికం (68 బిలియన్‌ డాలర్లు). తరువాతి స్థానంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచీ (43 బిలియన్‌ డాలర్లు), సౌదీ అరేబియా నుంచీ (34.5 బిలియన్‌ డాలర్లు) వెళ్లినవే ఉన్నాయి. భారతదేశం నుంచీ కూడా 2020లో 7 బిలియన్‌ డాలర్లు ఇతర దేశాలకు వెళ్లాయి.

గత మూడేళ్లుగా కొన్ని దేశాలకు వచ్చిన రెమిటెన్స్‌ను పరిశీలిస్తే…

దేశం 2020 – 2019 – 2018 (బిలియన్‌ డాలర్లలో) (బిలియన్‌ డాలర్లలో) (బిలియన్‌ డాలర్లలో) భారతదేశం 83.1 – 83.3 – 78.7 చైనా 59.5 – 68.3 – 67.4 మెక్సికో 42.8 – 39.0 – 35.7 ఫిలిప్పిన్స్‌ 34.9 – 35.2 – 33.8 ఈజిప్టు 29.6 – 26.7 – 25.5 పాకిస్తాన్‌ 26.1 – 22.2 – 21.1 ఫ్రాన్స్‌ 24.4 – 26.8 – 26.8 బంగ్లాదేశ్‌ 21.7 – 18.3 – 15.5 నేపాల్‌ 8.1 – 8.2 – 8.2 శ్రీలంక 7.1 – 6.7 – 7.0

ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం తమ మాతృ దేశాలకు సొమ్ములు పంపిస్తున్న వారిలో… గత దశాబ్ద కాలంగా భారతీయులే నెం.1 గా ఉన్నారు.

Also Read..