AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET Super Specialty Exam: ‘నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్షను వాయిదా వేయండి..’ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ

దక్షిణాది రాష్ట్రాల్లో పీజీ మెడికల్ 2022 విద్యార్థులకు తుది పరీక్షలు ఈ ఏడాది చివర్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్షను ఒకటి, రెండు నెలలపాటు వాయిదా వేయాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా..

NEET Super Specialty Exam: 'నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్షను వాయిదా వేయండి..' లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ
TDP Leader Lavu Srikrishna Devaraya
Srilakshmi C
|

Updated on: Sep 13, 2025 | 12:51 PM

Share

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రలో పీజీ మెడికల్ 2022 విద్యార్థులకు తుది పరీక్షలు ఈ ఏడాది చివర్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్షను ఒకటి, రెండు నెలలపాటు వాయిదా వేయాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. నీట్‌ సూపర్‌స్పెషాలిటీ 2025 పరీక్షను నవంబర్‌ 7, 8 తేదీల్లో నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారు చేశారు. అయితే ఈ తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పీజీ మెడికల్‌ 2022 బ్యాచ్‌ విద్యార్థుల ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు జరుగుతాయి. నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష రాసే విద్యార్ధుల సన్నద్ధతకు సమయం సరిపోదని, అందువల్ల నీట్‌ ఎస్‌ఎస్‌-2025ను వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

దివ్యాంగ అభ్యర్ధుల పోటీ పరీక్షల నిర్వహణలో కేంద్రం యూటర్న్‌!

వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొనే దివ్యాంగ అభ్యర్థుల కోసం ఇటీవల కేంద్రం సవరించిన మార్గ దర్శకాలను జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే వీటి అమలును ప్రభుత్వం ఈ ఏడాది చివరికి వాయిదా వేసింది. పరీక్షా సంస్థల్లో సంసిద్ధత లేకపోవడం, అభ్యర్థ ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు నిర్ణయించినట్లు (డీఈపీడబ్ల్యూడీ) ప్రకటించింది. ఈ ఏడాది చివరి వరకు నోటిఫై చేయబడిన అన్ని పోటీ పబ్లిక్ పరీక్షలు ప్రస్తుత చట్రంలోనే కొనసాగవచ్చని వికలాంగుల సాధికారత శాఖ (DEPwD) మెమోరాండంలో స్పష్టం చేసింది.

పరీక్షల నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడానికి, వర్తింప్రజేయడానికి సంస్థలు సంసిద్ధంగా లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకుని 2025, డిసెంబరు 31వరకు విడుదల చేసిన, చేయబోయే అన్ని పబ్లిక్ పోటీపరీక్షలను ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థ ప్రకారం నిర్వహించవచ్చని మెమోరాండం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.