AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constable Jobs: సెప్టెంబర్‌ 23 నుంచి కానిస్టేబుల్ పోస్టులకు శారీరక సామర్థ్య పరీక్షలు.. వెబ్‌సైట్లో అడ్మిట్‌కార్డులు

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి శారీరక సామర్థ్య పరీక్షల అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఈ మేరకు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్సు (CRPF) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇప్పటికే దేహ దారుఢ్య సామర్థ్య పరీక్షల తేదీలను వెల్లడించిన స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ తాజాగా ఇందుకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా..

Constable Jobs: సెప్టెంబర్‌ 23 నుంచి కానిస్టేబుల్ పోస్టులకు శారీరక సామర్థ్య పరీక్షలు.. వెబ్‌సైట్లో అడ్మిట్‌కార్డులు
Constable Physical Tests
Srilakshmi C
|

Updated on: Sep 15, 2024 | 6:27 AM

Share

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి శారీరక సామర్థ్య పరీక్షల అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఈ మేరకు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్సు (CRPF) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇప్పటికే దేహ దారుఢ్య సామర్థ్య పరీక్షల తేదీలను వెల్లడించిన స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ తాజాగా ఇందుకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 105 పరీక్ష కేంద్రాల్లో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) ఈవెంట్లు జరుగుతాయి. సెప్టెంబర్‌ 23 నుంచి ఫిజికల్‌ టెస్టులు ప్రారంభం అవుతాయి.

ఈ పోస్టుల భర్తీకి ఓపెన్ కాంపిటీటివ్ పరీక్ష ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించారు. ఇప్పటికే రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఆన్సర్‌ కీ విడుదల కాగా.. జులైలో రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో ఉత్తీర్ణులైన వారందరికీ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) నిర్వహిస్తారు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)లలో ప్రతిభ చూపిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.ఈ మొత్తం ప్రక్రియ పూర్తైన తర్వాత రిజర్వేషన్‌ వారీగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. కాగా ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 46,617 పోస్టులను భర్తీ చేయనున్నారు.

స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ పీఈటీ/ పీఎస్‌టీ అడ్మిట్‌కార్డు కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇండియన్ రైల్వేలో 11,558 ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు.. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 11,558 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో గ్రాడ్యుయేట్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరణాత్మక ప్రకటనను తాజాగా జారీ చేసింది. నాన్-టెక్నికల్ పాపులర్‌ కేటగిరి గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులన్నింటికీ డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 14, 2024 నుంచి అక్టోబరు 13, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!
Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?
Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?
ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా
ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా
వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ
వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ