RRB: రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా నాన్ టెక్నీకల్ పాపులర్ క్యాటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటి (శనివారం) నుంచి ప్రారంభమైంది...
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా నాన్ టెక్నీకల్ పాపులర్ క్యాటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటి (శనివారం) నుంచి ప్రారంభమైంది. ఇంతకీ ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నోటిఫికేషన్‌లో భాగంగా గ్రాడ్యుయేషన్ లెవల్ స్థాయిలో మొత్తం 8113 పోస్టులు ఉన్నాయి. వీటిలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ 1736, స్టేషన్ మాస్టర్ 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3144, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 732 ఖాళీలు ఉన్నాయి. ఇక అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో మొత్తం 3445 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్స్ 2022, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990, ట్రెయిన్స్ క్లర్క్ 72 ఖాళీలు ఉన్నాయి.
సెప్టెంబర్ 14వ తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇక ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే అక్టోబర్ 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
గ్రాడ్యుయేషన్ పోస్టులకు గాను సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు అప్లికేషన్ విండో అందుబాటులో ఉంటుంది. ఇక యూజీ పోస్టుల దరఖాస్తు స్వీకరణ విండో సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. ఎస్‌సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఎక్స్ సర్వీస్‌మెన్, ఈబీసీ వర్గాలకు చెందిన వారు రూ. 250 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులు రూ. 500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
అభ్యర్థులను కంట్యూటర్ ఆధారిత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ల ఆధారంగా వయసు సడలింపు ఉంటుంది. అప్లికేషన్ దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్హతలకు సంబంధించిన స్కాన్ కాపీలు, ఫొటోగ్రాఫర్, సిగ్నేచర్ వంటివి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..