SMPORT Recruitment 2022: నెలకు రూ.82 వేల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
కోల్‌కతాలోని శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్ట్.. 26 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అడ్మిన్ ఆఫీసర్, జీడీఎంఓ, పర్మనెంట్ వే ఇన్‌స్పెక్టర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
కోల్‌కతాలోని శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్ట్.. 26 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అడ్మిన్ ఆఫీసర్, జీడీఎంఓ, పర్మనెంట్ వే ఇన్‌స్పెక్టర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఏ/బీఎస్సీ/బీసీఏ/బీకాం/సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ/ఎంబీఏ/ఎంబీబీఎస్/ఎమ్‌ఎస్/డీఎన్బీ/బీటెక్/పీజీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 35 నుంచి 63 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 31, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికై వారికి ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
- ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.30,000
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు నెలకు రూ.75,000
- అడ్మిన్ ఆఫీసర్ (మెడికల్) పోస్టులకు నెలకు రూ.64,000
- జీడీఎంఓ (ఆప్తల్మాలజిస్ట్) పోస్టులకు నెలకు రూ.82,280
- జీడీఎంఓ (రేడియాలజిస్ట్) పోస్టులకు నెలకు రూ.82,280
- సూపరింటెండెంట్ బోట్ రిజిస్ట్రేషన్ నెలకు పోస్టులకు రూ.75,000
- పర్మనెంట్ వే ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నెలకు రూ.42,550
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.