TS Govt Jobs 2022: తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ హైదరాబాద్‌లోని డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌.. ఒప్పంద ప్రాతిపదికన ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ (ఇన్‌స్టిట్యూషన్‌ కేర్, నాన్ ఇన్‌స్టిట్యూషన్‌ కేర్), లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌ తదితర..

TS Govt Jobs 2022: తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Telangana
Follow us

|

Updated on: Dec 04, 2022 | 7:03 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ హైదరాబాద్‌లోని డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌.. ఒప్పంద ప్రాతిపదికన ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ (ఇన్‌స్టిట్యూషన్‌ కేర్, నాన్ ఇన్‌స్టిట్యూషన్‌ కేర్), లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌, సోషల్‌ వర్కర్‌, ఔట్ రీచ్‌ వర్కర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు విద్యార్హతలు, వయోపరిమితి, అనుభవం వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 15, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. పోస్టుల వారీగా జీతభత్యాల వివరాలు ఈ కింది విధంగా ఉంటాయి. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ (ఇన్‌స్టిట్యూషన్‌ కేర్) పోస్టులకు నెలకు రూ.27,300 జీతంగా చెల్లిస్తారు.
  • ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ (నాన్ ఇన్‌స్టిట్యూషన్‌ కేర్) పోస్టులకు నెలకు రూ.27,300 జీతంగా చెల్లిస్తారు.
  • లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌ పోస్టులకు నెలకు రూ.27,300 జీతంగా చెల్లిస్తారు.
  • సోషల్‌ వర్కర్‌ పోస్టులకు నెలకు రూ.18,200 జీతంగా చెల్లిస్తారు.
  • ఔట్ రీచ్‌ వర్కర్ పోస్టులకు నెలకు రూ.10,400 జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్..

జిల్లా సంక్షేమాధికారి, WCD & SC, హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఆవరణ, 1వ అంతస్తు, పాత కలెక్టరేట్‌ బిల్డింగ్‌, నాంపల్లి స్టేషన్‌ రోడ్, అబిడ్స్‌, హైదరాబాద్‌-500001.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.