AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ విడుదల.. ఖాళీల వివరాలు ఇవే..!

SBI Recruitment 2021: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. వేర్వేరు విభాగాల్లో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌, ఫార్మాసిస్ట్‌, మేనేజర్‌,సీనియర్‌ స్పెషల్‌ ఎగ్జిక్యూటీవ్‌,...

SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ విడుదల.. ఖాళీల వివరాలు ఇవే..!
Sbi
Subhash Goud
| Edited By: Shiva Prajapati|

Updated on: Apr 14, 2021 | 7:05 AM

Share

SBI Recruitment 2021: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. వేర్వేరు విభాగాల్లో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌, ఫార్మాసిస్ట్‌, మేనేజర్‌,సీనియర్‌ స్పెషల్‌ ఎగ్జిక్యూటీవ్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌, డిప్యూటీ చీఫ్‌ టెక్నాలజీ, డిప్యూటీ మేనేజర్‌, చీఫ్‌ ఎథిక్స్‌ ఆఫీసర్‌, అడ్వైజర్‌, డేటా అనలిస్ట్‌ తదితర పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగాల భర్తీ కోసం వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది ఎస్‌బీఐ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. అయితే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2021 ఏప్రిల్‌ 13 నుంచి ప్రారంభం అయ్యాయి. దరఖాస్తు చివరి తేదీ 2021 మే 3వ తేదీ వరకు.

విద్యార్హతలు.. ఖాళీల వివరాలు ఇవే..

మొత్తం ఖాళీలు- 86 మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్)- 1 మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్)- 2 సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ (కాంప్లయెన్స్)- 1 సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ (స్ట్రాటజీ-టీఎంజీ)- 1 సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ (గ్లోబల్ ట్రేడ్)- 1 సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (రీటైల్ అండ్ సబ్సిడరీస్)- 1 సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఫైనాన్స్)- 1 సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (మార్కెటింగ్)- 1 డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (ఐటీ-డిజిటల్ బ్యాంకింగ్)- 1 మేనేజర్ (హిస్టరీ)- 1 ఎగ్జిక్యూటీవ్ (డాక్యుమెంట్ ప్రిజర్వేషన్-ఆర్కైవ్స్)- 1 మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్)- 20 మేనేజర్ (జాబ్ ఫ్యామిలీ అండ్ సక్సెషన్ ప్లానింగ్)- 1 మేనేజర్ (రెమిటెన్సెస్)- 1 డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్-ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్)- 1 డిప్యూటీ మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్)- 5 డిప్యూటీ మేనేజర్ (ఎనీటైమ్ ఛానెల్)- 2 డిప్యూటీ మేనేజర్ (స్ట్రాటజిక్ ట్రైనింగ్)- 1 చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్- 1 అడ్వైజర్ (ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్)- 3 ఫార్మాసిస్ట్- 34 డేటా అనలిస్ట్- 5

దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 13 దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 3 ఆన్‌లైన్ ఫీజు పేమెంట్- 2021 ఏప్రిల్ 13 నుంచి 2021 మే 3 దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2021 మే 3 దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2021 మే 15

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు- రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ

ఇవీ చదవండి: IIT Hyderabad: హైదరాబాద్‌ ఐఐటీలో సరికొత్త కోర్సులు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ.. వెంటనే అప్లై చేసుకోండి…

CBSE Exams 2021: బోర్డు పరీక్షలు రద్దు చేయండి.. లేకపోతే కరోనా ప్రళయమే: సీఎం కేజ్రీవాల్

Common Examination: ఎడ్‌సెట్‌ పరీక్ష విధానంలో ప్రభుత్వం మార్పులు.. సబ్జెక్టుల వారీగా ర్యాంకుల విధానం రద్దు

Reliance Jio: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రిలయన్స్ జియోలో భారీగా ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?