NEET PG 2021: నీట్‌ పీజీ పరీక్ష అడ్మిట్‌ కార్డుల విడుదల.. ఇలా సులువుగా డౌన్‌లౌడ్‌ చేసుకోండి..

NEET PG Exam 2021 Admit cards: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) నీట్ పీజీ 2021 పరీక్షకు సబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. నీట్ పీజీ ప్రవేశ

NEET PG 2021: నీట్‌ పీజీ పరీక్ష అడ్మిట్‌ కార్డుల విడుదల.. ఇలా సులువుగా డౌన్‌లౌడ్‌ చేసుకోండి..
NEET PG 2021
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 14, 2021 | 11:18 AM

NEET PG Exam 2021 Admit cards: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) నీట్ పీజీ 2021 పరీక్షకు సబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. నీట్ పీజీ (NEET PG) ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎబీఈ (National Board of Examinations) అధికారిక వెబ్‌సైట్ nbe.edu.in నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 18న జరగనుంది. వాస్తవానికి నీట్ పీజీ 2021 అడ్మిట్ కార్డులు ఏప్రిల్ 12న సోమవారమే విడుదల కావాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపం కారణంగా అడ్మిట్ కార్డులను ఆ తేదీన విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఎన్‌బీఈ అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. సాంకేతిక కారణాల వల్ల కార్డులను విడుదల చేయలేదని.. బుధవారం విడుదల చేస్తామని ఎన్‌బీఈ వెల్లడించింది.

అడ్మిట్‌ కార్డులను ఇలా సులువుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

ముందుగా నీట్ పీజీ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ nbe.edu.in లోకి లాగిన్ అవ్వాలి. నీట్ పీజీ 2021ను ఎంపిక చేసుకోవాలి హోమ్ పేజీలో నీట్ పీజీ 2021 దరఖాస్తుదారు లాగిన్ లింక్‌పై క్లిక్ చేయాలి రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, వివరాలను నమోదు చేయాలి అనంతరం అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోని ప్రింట్ అవుట్ తీసుకోవాలి

కాగా.. దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ తరుణంలో నీట్ పరీక్షను వాయిదా వేయాలని అన్ని చోట్ల నుంచి వ్యతిరేకత వినిపించింది. అయినప్పటికీ.. నీట్‌ పీజీ పరీక్ష (NEET PG 2021) షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా జరుగుతుందని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (NBE) స్పష్టంచేసింది. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు ఎన్‌బీఈ పలు మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా.. నీట్ పీజీ పరీక్షను దేశవ్యాప్తంగా 1.75 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు. 18 న మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల వరకు ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్ష ఫలితాలను మే 31న వెల్లడించనున్నారు.

ఎన్‌బీఈ విడుదల చేసిన మార్గదర్శకాలు..

• దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను మరింత కఠినం చేస్తూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. • కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే పరీక్ష కేంద్రాలను పెంచినట్లు పేర్కొంది. • దీంతోపాటు విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా.. సులువుగా ప్రయాణించేలా ఈ పాస్‌లు జారీ చేయనున్నట్లు బోర్డు తెలిపింది. • పరీక్షా కేంద్రాల్లో ప్రవేశానికి వేరు వేరు సమయాలను కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఈ వివరాలు పరీక్ష రాసే అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌, మెయిల్‌ ద్వారా పంపనున్నారు. • పరీక్షకు హాజరయ్యేవారు మాస్క్‌ ధరించడం, హాండ్‌ శానిటైజర్‌ ఉపయోగించడం తప్పనిసరని పేర్కొంది. • పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు. ఒకవేళ వారికి టెంపరేచర్ అధికంగా ఉంటే ప్రత్యేక గదిలో పరీక్ష నిర్వహిస్తారు. • ఈ మేరకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ రాష్ట్రాలకు కూడా పలు సూచనలు చేసింది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

Also Read:

Gold Smuggling : సూట్ కేస్ ఫ్రేమ్ లో బంగారం దాచుకొని దేశాలు దాటారు, చివరికి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో..

బిట్ కాయిన్ ఆల్ టైం రికార్డ్, వాల్‌స్ట్రీట్‌లో క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ త‌న షేర్లను ఆవిష్కరిస్తున్న వేళ అద్భుతం

అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!