SBI Recruitment: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ..
SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పని అనుభవం ఆధారంగా రిక్రూట్ భర్తీ చేయనున్న ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 606 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో రిలేషన్‌షిప్ మేనేజర్ (334), కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (217), ఇన్వస్ట్‌మెంట్ ఆఫీసర్ (12), సెంట్రల్ రిసెర్చ్ టీం (ప్రొడక్ట్ లీవడ్, సపోర్ట్) – (04), ఎగ్జిక్యూటివ్ (డ్యాక్యుమెంట్ ప్రిజర్వేషన్) – 01, మేనేజర్ (మార్కెటింగ్) 12, డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్) 23 ఖాళీలు ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫుల్ టైం ఎంబీఏ/ పీజీడీఎం / తత్సమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. * అభ్యర్థుల వయసు పోస్టు ఆధారంగా 23 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను ముందుగా అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ/ఆన్‌లైన్ టెస్ట్, ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రయి 28-09-2021న మొదలు కాగా 18-10-2021తో ముగియనుంది. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..