NPCIL Recruitment: ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశం.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో..
NPCIL Recruitment: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన ఈ సంస్థలో..
NPCIL Recruitment: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన ఈ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టులను ఇప్పుడు కాకుండా వచ్చే ఏడాది తీసుకోనున్నారు. గేట్ స్కోర్ ఆధారంగా చేపట్టనున్న ఈ నియామకాలను 2022 గేట్ ఫలితాల తర్వాత నిర్వహించనున్నారు. కాబట్టి ప్రస్తుతం గేట్ పరీక్షకు సిద్ధమవుతున్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఈటీ-2022) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు 2020/ 2021 / 2022 గేట్ స్కోర్‌ను కలిగి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముందుగా 2020/ 2021/ 2022 గేట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల్ని పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 10-04-2022 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Prison Gang Clash: జైలులో మారణకాండ.. 24 మంది ఖైదీలు దుర్మరణం.. బాంబులు, తుపాకులతో..