SBI Clerk Recruitment: నిరుద్యోగులకు అలర్ట్.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 13,735 క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. యేటా వేలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారీగా క్లర్క్ ఉద్యోగాల కోసం మరోమారు ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 17వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు..

SBI Clerk Recruitment: నిరుద్యోగులకు అలర్ట్.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 13,735 క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
SBI Clerk Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 17, 2024 | 3:10 PM

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్‌- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నుంచి వచ్చే ఉద్యోగ ప్రకటనల కోసం ఏటా లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఎస్‌బీఐ క్లర్క్‌ (జూనియర్‌ అసోసియేట్‌) జాబ్‌ భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 13,735 క్లర్క్‌ ఖాళీలు భర్తీ కానున్నాయి. కస్టమర్ సపోర్ట్ & సేల్స్‌ విభాగంలో జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా పోస్టులు ఉన్నాయి.

ఎస్బీఐ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయెల్ డిగ్రీ (ఐడీడీ) సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 31,2024 నాటికి ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 01, 2024 నాటికి 20 నుంచి 28 మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్ 02, 1996 కంటే ముందు ఏప్రిల్ 01, 2004 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబర్‌ 17 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 7, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్ఎస్/ డీఎక్స్ఎస్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎస్బీఐలో క్లర్‌ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నిరుద్యోగులకు అలర్ట్.. SBIలో 13735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు అలర్ట్.. SBIలో 13735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో ఇండియా రికార్డు..!
స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో ఇండియా రికార్డు..!
బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!
బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!
ప్రభాస్ సినిమాకు నో చెప్పిన ఆ క్రేజీ హీరోయిన్! కారణమేంటో తెలుసా?
ప్రభాస్ సినిమాకు నో చెప్పిన ఆ క్రేజీ హీరోయిన్! కారణమేంటో తెలుసా?
దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు
దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు
మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..
మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..
రైతులకు సులువుగా రుణాలు.. రూ.1000 కోట్లతో రుణ హామీ పథకం
రైతులకు సులువుగా రుణాలు.. రూ.1000 కోట్లతో రుణ హామీ పథకం
లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల SA 1 మ్యాథ్స్‌ పేపర్ లీక్!
లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల SA 1 మ్యాథ్స్‌ పేపర్ లీక్!
నవ్వు ఆపుకోలేరు..! పెళ్లి మండపంలోనే మరదలితో సరసాలాడిన వరుడు..
నవ్వు ఆపుకోలేరు..! పెళ్లి మండపంలోనే మరదలితో సరసాలాడిన వరుడు..
వామ్మో ఈ పాడు ఎలుకులు ఎంత పని చేశాయి..
వామ్మో ఈ పాడు ఎలుకులు ఎంత పని చేశాయి..