AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు.. ఏ తేదీనంటే?

దుబాయ్ మహా నగరంలో తెలుగోళ్లు ఉద్యోగం పొందే అవకాశం. కేవలం పదో తరగతి అర్హతతో దుబాయ్ లో ఉద్యోగం పొందొచ్చు. దళారుల మాయలో పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా దుబాయ్ లో జాబ్ చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఈ కింది పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు..

Hyderabad: దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు.. ఏ తేదీనంటే?
Delivery Boy
Srilakshmi C
|

Updated on: Dec 17, 2024 | 2:47 PM

Share

హైదరాబాద్‌, డిసెంబర్ 17: దుబాయ్‌లో ఉద్యోగాల పేరిట కేటుగాళ్ల మాయలో పడి ఎందరో తమ జీవితాలు బుగ్గిపాలు చేసుకున్నారు. ఇలా దళారీల మాయలో పడకుండా దుబాయ్‌ దేశంలో ఉద్యోగాలకు తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా నియామకాలు చేపడతారు. వాటి ద్వారా వెళ్లిన వారికి ఎలాంటి భయం, బెదిరింపులు ఉండవు. పైగా సాఫీగా ఉద్యోగం చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన ఛాన్స్ ఇప్పుడు మళ్లీ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో విదేశీ ఉద్యోగాలకు సంబంధించిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఉందన్న సంగతి తెలిసిందే. ఇది యేటా విదేశాల్లో ఉద్యోగా నియామకాలకు సంబంధించిన రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ నిర్వహిస్తుంది. ఇప్పటికే పలు దేశాల్లో యువతకు ఉపాధి అవకాశాలు చూపించిన టామ్‌కామ్ తాజాగా దుబాయ్‌లో ఉద్యోగాలకు ప్రకటన జారీ చేసింది.

దుబాయ్‌లో ఇటీవల నర్స్‌ ఉద్యోగాలకు టామ్‌కామ్ నియామకాలు చేపట్టింది. తాజాగా ఆ దేశంలో బైక్‌ రైడర్‌ (డెలివరీ బాయ్స్‌) ఉద్యోగాల కోసం ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు డిసెంబరు 20వ తేదీన ఐటీఐ మల్లేపల్లి క్యాంపస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు టామ్‌కామ్‌ తెలిపింది. అభ్యర్థులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 21-38 ఏళ్ల వయసు ఉండాలని పేర్కొంది. బైక్‌ లైసెస్సు ఉండాలని, లైసెన్స్ పొంది మూడేళ్లు దాటి ఉండాలని సూచించింది. దుబాయ్‌లో ఉద్యోగం పొందాలనే ఆసక్తి కలిగిన వారు తమ పాస్‌పోర్టుతో హాజరు కావాలని సూచించింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలకు 9440050951, 9440049861, 9440051452 నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరింది.

‘కేవంల ప్రవేశ పరీక్షల నిర్వహణకే ఎన్‌టీఏ పరిమితం’.. కేంద్ర విద్యా శాఖ మంత్రి వెల్లడి

జాతీయ స్థాయిలో వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి ఎన్టీయే ప్రవేశ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు సంబంధించి సంస్కరణలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 202-26 విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలను మాత్రమే ఎన్‌టీఏ నిర్వహిస్తుందన్నారు. ఉద్యోగ నియామక పరీక్షలు ఎన్టీయే నిర్వహించదని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.