REC Power Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఆర్‌ఈసీలో ఉద్యోగవకాశాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం.

REC Power Development Recruitment: ఆర్‌ఈసీ పవర్‌ డెలప్‌మెంట్‌ అండ్‌ కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన...

REC Power Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఆర్‌ఈసీలో ఉద్యోగవకాశాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం.
Rec Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 14, 2021 | 11:26 AM

REC Power Development Recruitment: ఆర్‌ఈసీ పవర్‌ డెలప్‌మెంట్‌ అండ్‌ కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో ఉద్యోగాలును తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులెవరు.? దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. * ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ మెటీరియల్‌ ఇన్‌స్పెక్షన్, సివిల్, ఎఫ్‌ అండ్‌ ఏ, కాంట్రాక్ట్‌–ప్రొక్యూర్‌మెంట్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో బీఈ/బీటెక్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. * అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 35ఏళ్ల నుంచి 48ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను మొదట అకడామిక్‌, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. * పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.62,000 నుంచి 1,35,000 వరకు చెల్లిస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 24-08-2021 చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Lovers Death: కారులోనే అగ్నికి ఆహుతైన ప్రేమజంట.. అసలేమైందంటే..?

AP LPCET – 2021: సెప్టెంబర్ 25న ఎల్‌పీసెట్‌ ప్రవేశ పరీక్ష.. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల స్వీకరణ..

DRDO Recruitment: డీఆర్‌డీఓలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్స్‌.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. ఇలా అప్లై చేసుకోండి.