AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Mela: నిరుద్యోగులకు మంచి అవకాశం.. నేడు సికింద్రాబాద్‌ వెస్లీ కళాశాలలో మెగా జాబ్‌ మేళా. 40 కపెనీలు, 500 ఉద్యోగాలు.

Job Mela: కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయారా.? పలు కంప్యూటర్‌ కోర్సులు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ అవకాశం మీకోసమే. సికింద్రాబాద్‌లోని వెస్లీ..

Job Mela: నిరుద్యోగులకు మంచి అవకాశం.. నేడు సికింద్రాబాద్‌ వెస్లీ కళాశాలలో మెగా జాబ్‌ మేళా. 40 కపెనీలు, 500 ఉద్యోగాలు.
Job Mela Secundrabad
Narender Vaitla
|

Updated on: Aug 14, 2021 | 10:26 AM

Share

Job Mela: కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయారా.? పలు కంప్యూటర్‌ కోర్సులు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ అవకాశం మీకోసమే. సికింద్రాబాద్‌లోని వెస్లీ కళాశాలలో నేడు (శనివారం) మెగా జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ విషయమై వెస్లీ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ విమల్‌ సుకుమార్‌ ప్రకటనలో తెలిపారు. ఈ మెగా జాబ్‌ మేళాను స్పైస్ జాబ్‌, వైఎంసీఏ, వెస్లీ కళాశాల, ఎన్‌జివోలతో కలిసి ఏర్పాటు చేస్తున్నారు. ఈ జాబ్‌ మేళాలతో 40 కంపెనీలు పాల్గొంటున్నాయి. వీటిలో పలు మల్టీ నేషనల్‌ కంపెనీలు కూడా ఉన్నాయి. పదో తరగతి నుంచి బీటెక్‌, ఎంబీఏ కోర్సులు చేసిన వారు ఈ జాబ్‌ మేళాలో పాల్గొనవచ్చు.

కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు, పలు రకాల టెక్నీకల్‌ కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ జాబ్‌ మేళా ద్వారా సుమారు 500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 20 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వారు ఇందులో పాల్గొనవచ్చు. ఏవైనా సందేహాలు, ఇతర వివరాల కోసం 8885410555, 8885073555 నెంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు శనివారం ఉదయం 9.30 గంటల నుంచి నేరుగా కళాశాలకు వెళ్లి స్పాట్ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి.

Also Read: Electric Scooter: స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్.. ప్రీ బుకింగ్ ఎలా అంటే

WhatsApp Honey Trap: కవ్విస్తారు.. అలా కనిపిస్తారు. మిమ్మల్ని అలాగే కనిపించమంటారు. కక్కుర్తి పడ్డారో ఇక అంతే..

Terrorist Arrested: జమ్మూకాశ్మీర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది అరెస్ట్‌.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..