AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nursing Jobs Notification: గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న నర్సింగ్ విద్యార్ధ్యులకు గుడ్ న్యూస్..

Nursing Jobs: నర్సింగ్ చదివిన ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం..

Nursing Jobs Notification: గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న నర్సింగ్ విద్యార్ధ్యులకు గుడ్ న్యూస్..
Dmho
Surya Kala
|

Updated on: Aug 14, 2021 | 1:11 PM

Share

Nursing Jobs: నర్సింగ్ చదివిన ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO) లో కాంట్రాక్ట్ బేసిస్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతుంది. దరఖాస్తు చేసుకునేవారు తప్పని సరిగా నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. దరఖాస్తులను నేరుగా సమర్పించాల్సి ఉంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి రుసుముని చెల్లించాల్సిన అవసరం లేదు.https://www.fresherstore.com/dmho-hyderabad-recruitment-2021/

ఉద్యోగం పూర్తి వివరాలు :

జాబ్: బస్తీ దవాఖానా, ఎన్‌హెచ్‌ఎం, ఎస్‌సీయూ/ ఎన్‌బీఎస్‌యూ. మొత్తం ఖాళీలు : 96 అర్హత : జీఎన్ఎం / బీఎస్సీ (నర్సింగ్‌) ఉత్తీర్ణత. వయస్సు : 01.08.2021 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి వేతనం : నెలకు రూ. 18,000 – 40,000/- ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు , వయసు , రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 13, 2021 చివరి తేదీ: ఆగష్టు 16, 2021

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:

DM&HO, 4th Floor, Harihara Kala Bhavan, Patny, Secunderabad

Also Read:  తవ్వకాల్లో బయల్పడిన రాగి శాసనాలను చూసిన అమిత్ షా.. ప్రదర్శనకు పెట్టాలని సూచన