RBI Recruitment 2023: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హతలు, నియామక విధానం వంటి పూర్తి వివరాలివే
ముంబాయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన లేటరల్ రిక్రూట్‌మెంట్ విధానంలో 37 కన్సల్టెంట్స్, సబ్జెక్ట్ స్పెషలిస్ట్స్, ఎనలిస్ట్ (గ్రేడ్-సీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ..
ముంబాయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన లేటరల్ రిక్రూట్‌మెంట్ విధానంలో 37 కన్సల్టెంట్స్, సబ్జెక్ట్ స్పెషలిస్ట్స్, ఎనలిస్ట్ (గ్రేడ్-సీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, పీజీపీఎం/ పీజీడీఎంలో ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. 23 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలి. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 11, 2023వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ప్రిలిమినరీ స్క్రీనింగ్/ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..
- డేటా సైంటిస్ట్ పోస్టుల సంఖ్య: 3
- డేటా ఇంజినీర్ పోస్టుల సంఖ్య: 1
- ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ పోస్టుల సంఖ్య: 10
- ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టుల సంఖ్య: 8
- ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టుల సంఖ్య: 6
- నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల సంఖ్య: 3
- ఎకనామిస్ట్ (మాక్రో-ఎకనామిక్ మోడలింగ్) పోస్టుల సంఖ్య:1
- డేటా అనలిస్ట్ (అప్లైడ్ మ్యాథమెటిక్స్) పోస్టుల సంఖ్య: 1
- డేటా అనలిస్ట్ (అప్లైడ్ ఎకనామెట్రిక్స్) పోస్టుల సంఖ్య: 2
- డేటా అనలిస్ట్ (టీఏబీఎం/ హెచ్‌ఏఎన్‌కే మోడల్స్) పోస్టుల సంఖ్య: 2
- అనలిస్ట్ (క్రెడిట్ రిస్క్) పోస్టుల సంఖ్య:1
- అనలిస్ట్ (మార్కెట్ రిస్క్) పోస్టుల సంఖ్య:1
- అనలిస్ట్ (లిక్విడిటీ రిస్క్) పోస్టుల సంఖ్య:1
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.