RGNIYD Recruitment: రాజీవ్‌గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
RGNIYD Recruitment: రాజీవ్‌గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో...
RGNIYD Recruitment: రాజీవ్‌గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తమిళనాడులో ఉన్న ఈ సంస్థలో మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 06 ఖాళీలకు గాను ఫైనాన్స్ ఆఫీసర్–01, సెక్షన్ ఆఫీసర్–01, లైబ్రరీ అసిస్టెంట్–01, లైబ్రరీ అటెండెంట్ కమ్ టైపిస్ట్–01, జూనియర్ అసిస్టెంట్–02 పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థలు వయసు పోస్టుల ఆధారంగా 25, 30 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థలు ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఆన్‌లైన్ అప్లై చేసుకున్న తర్వాత దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆర్‌జీఎన్‌ఐవైడీ, శ్రీపెరుంబుదూర్, కంచిపురం, తమిళనాడు–602105 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ 26-11-2021తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Diwali 2021: సుఖ సంతోషాలతో ఉండాలంటే దీపావళి ముందురోజు ఈ 5 పనులు చేయాలి..!
Balakrishna: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ షూరు.. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..