AP Inter Exams: ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు అలర్ట్.. అక్టోబరు 15 నుంచే త్రైమాసిక పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు అక్టోబరు 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 15 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్షలు..

AP Inter Exams: ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు అలర్ట్.. అక్టోబరు 15 నుంచే త్రైమాసిక పరీక్షలు
AP Inter Exams
Follow us

|

Updated on: Sep 29, 2024 | 3:02 PM

అమరావతి, సెప్టెంబర్‌ 29: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు అక్టోబరు 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 15 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇక ద్వితీయ సంవత్సరం వారికి ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకి ఒక్కో పరీక్ష చొప్పున ఉంటుంది. అంటే సదరా సెలవుల అనంతరం ఈ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇక ఏపీలోని పాఠశాలలు, కాలేజీలకు అక్టోబర్‌ 4 నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించింన సంగతి తెలిసిందే. అంటే మొత్తం 10 రోజులు సెలవులు రానున్నాయి.

అక్టోబర్‌ 1న తెలంగాణ డీఈఈ సెట్‌ 2024 ధ్రువపత్రాల పరిశీలన

తెలంగాణ డీఈఈసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి అర్హత సాధించిన అభ్యరులకు అక్టోబరు ఒకటో తేదీన రాష్ట్రంలోని ఆయా డైట్ కాలేజీల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఈ మేరకు ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యరులు హాజరు కావాలని కన్వీనర్‌ శ్రీనివాసాచారి ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీలోని పీజీ మెడికల్‌ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆంధ్రా, ఎస్వీ వర్సిటీ పరిధిలోని 35 వైద్య కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ ఎండీ, ఎంఎస్‌ కోర్సుల్లో కన్వీనర్, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించి విజయవాడ ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీ వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అక్టోబరు 4 వరకు వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసి సంబంధిత పత్రాలు విశ్వవిద్యాలయానికి పంపాల్సి ఉంటుంది. అపరాధ రుసుం రూ.10 వేలతో అక్టోబరు 7 వరకు అనుమతి ఇస్తారు. కన్వీనర్‌ కోటాకు దాదాపు 3,200 సీట్లు, యాజమాన్య కోటాకు 1,600 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జాతీయ వైద్య కమిషన్‌ అనుమతుల దృష్ట్యా సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచరం. ఏవైనా సాంకేతిక సమస్యలుంటే 9000780707, 8008250842 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారా? మీ ఇంట్లో ఇది ఉండాల్సిందే..
వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారా? మీ ఇంట్లో ఇది ఉండాల్సిందే..
చేపట్టిన పనిలో సక్సెస్ కోసం దసరా రోజున ఈ పరిహారాలు చేసి చూడండి
చేపట్టిన పనిలో సక్సెస్ కోసం దసరా రోజున ఈ పరిహారాలు చేసి చూడండి
భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదం.. మళ్లీ అదే తప్పు!
భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదం.. మళ్లీ అదే తప్పు!
పండుగైనా.. తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే..
పండుగైనా.. తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే..
నానో కారు తయారీకి అసలు కారణం ఇదా.. రతన్ టాటాకు హేట్సాఫ్..
నానో కారు తయారీకి అసలు కారణం ఇదా.. రతన్ టాటాకు హేట్సాఫ్..
Horoscope Today: ఖర్చుల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త..
Horoscope Today: ఖర్చుల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త..
ఇన్‌ఫినిక్స్‌ మరో అద్భుతం.. బడ్జెట్‌లో ఫ్లిప్‌ ఫోన్‌..
ఇన్‌ఫినిక్స్‌ మరో అద్భుతం.. బడ్జెట్‌లో ఫ్లిప్‌ ఫోన్‌..
మరింత అట్రాక్టివ్‌గా వాట్సాప్‌.. త్వరలోనే మరో స్టన్నింగ్‌ ఫీచర్‌
మరింత అట్రాక్టివ్‌గా వాట్సాప్‌.. త్వరలోనే మరో స్టన్నింగ్‌ ఫీచర్‌
సాబుదాన తింటున్నారా.? అయితే ఓసారి ఆలోచించుకోవాల్సిందే..
సాబుదాన తింటున్నారా.? అయితే ఓసారి ఆలోచించుకోవాల్సిందే..
గూడ్స్‌ రైలును ఢీకొన్న ఎక్స్‌ప్రెస్‌.. రెండు బోగీల్లో మంటలు!
గూడ్స్‌ రైలును ఢీకొన్న ఎక్స్‌ప్రెస్‌.. రెండు బోగీల్లో మంటలు!