AP TET 2024 Hall Tickets: మరో 4 రోజుల్లో ఏపీ టెట్ పరీక్షలు.. 94 శాతం హాల్‌టికెట్లు డౌన్‌లోడ్: విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2024 పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 3 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి హాల్ టికెట్లను వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే..
అమరావతి, సెప్టెంబర్ 29: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2024 పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 3 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి హాల్ టికెట్లను వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. టెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో ఇప్పటి వరకు 94.30 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 4,27,300 మంది టెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 4,02,935 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పరీక్ష తేదీ సమీపిస్తున్న తరుణంలో మిగిలిన వారు కూడా వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
కాగా ఏపీలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ తొలి సంతకం మెగా డీఎస్సీపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టెట్ వెయిటీజీ డీఎస్సీకి కీలకం కానుంది. అందువల్లనే ఈసారి టెట్ రేసే అభ్యర్ధుల సంఖ్య గరిష్టానికి చేరుకుంది. మొత్తం 19 రోజులపాటు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్న టెట్ పరీక్షలు రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరగనున్నాయి. అక్టోబరు 11, 12 తేదీలు మినహా 3 నుంచి 21 వరకు వరుసగా టెట్ నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను పొందొచ్చు.
హాల్ టికెట్ల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాల కేటాయింపు విషయంలో ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే డైరెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 9398810958, 6281704160, 8121947387, 8125046997, 7995789286, 9398822554, 7995649286, 9963069286, 9398822618 ఫోన్ నంబర్లకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫోన్ చేయవచ్చని సూచించారు. టెట్ పరీఞలొ ఓసీ(జనరల్) కేటగిరీకి చెందిన అభ్యర్ధులకు 60 శాతం మార్కులు ఆపైన వస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఇక బీసీ అభ్యర్ధులకు 50 శాతం మార్కులకుపైన, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు 40 శాతం మార్కులకుపైన మార్కులు వస్తే ఉత్తీర్ణత అయినట్లు అవుతుంది.