Supply Exams: విద్యార్ధులకు తీపికబురు.. ఇకపై ఏడాదికి 2 సార్లు సప్లిమెంటరీ పరీక్షలు

సాధారణంగా ఏదైనా పరీక్షలో తప్పితే ఏడాదికి ఒక్కసారే నిర్వహిస్తారు. జూన్ లేదా జులైలో మాత్రమే ఈ పరీక్షలు జరుగుతాయి. దీంతో ఏడాదంతా వేచి ఉండి ఈ పరీక్షలురాసేవారు. ఇకపై దీనికి చెక్ పెట్టేందుకు విద్యాశాఖ ముందుకొచ్చింది..

Supply Exams: విద్యార్ధులకు తీపికబురు.. ఇకపై ఏడాదికి 2 సార్లు సప్లిమెంటరీ పరీక్షలు
Polytechnic Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 13, 2024 | 4:59 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 13: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. అదేంటంటే.. ప్రతి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని విద్యార్ధుల కోసం నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలను ఇకపై రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఏదైనా సబ్జెక్టులో తప్పితే ఏడాది వరకు వేచి ఉండకూడదన్న అభిప్రాయంతో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విధానం ఈ ఏడాది నుంచే రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో అమలులోకి రానుంది.

దీంతో ఇకనుంచి సెమిస్టర్‌ పరీక్షల్లో ఏదైనా ఒక సబ్జెక్టులో తప్పినా.. వెంటనే ఆ సబ్జెక్ట్‌ పరీక్షలు రాసి పాసయ్యేందుకు వీలవుతుంది. అంటే.. ఏడాది వరకు వేచి చూడాల్సిన అవసరం లేదన్నమాట. కాగా గత ఏడాది వరకు జూన్‌ నెలలో మాత్రమే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేవారు. ఇక నుంచి జూన్‌తో పాటు డిసెంబరు లేదా జనవరిలోనూ సప్లిమెంటరీ పరీక్షలు జరుపుతారు. ఈ ఏడాదికి డిసెంబర్‌ 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో ప్రతీ ఏటా డిప్లొమా కోర్సుల్లో దాదాపు 30 వేల మంది వరకు ప్రవేశాలు పొందుతుంటారు.

ఇక ప్రభుత్వ బడుల్లో ‘ఫేషియల్‌ రికగ్నైజేషన్‌’ షురూ.. బోధన, బోధనేతర సిబ్బందికి అమలు

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఫేషియల్‌ రికగ్నైజేషన్‌’ హాజరు అమలు చేయాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించింది. దీనిని ప్రభుత్వ బడుల్లోని పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది అందరికీ అమలు చేసేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో భాగంగా తొలుత పెద్దపల్లి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేయనుంది. ఈ మేరకు జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్‌ స్కూళ్లు, సాధారణ గురుకులాలు, కేజీబీవీలు, యూఆర్‌ఎస్‌ పాఠశాలల్లో అమలు చేసేలా డీఈవోలు చర్యలు తీసుకోవాలని సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్టు అధికారి ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.